హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Air India Tickets: ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. టికెట్ల కొనుగోలుపై తాజా సూచనలు..

Air India Tickets: ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. టికెట్ల కొనుగోలుపై తాజా సూచనలు..

5. డిసెంబరు 30న రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు పైలట్లు ఏటీసీ నుంచి అవసరమైన క్లియరెన్స్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5. డిసెంబరు 30న రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు పైలట్లు ఏటీసీ నుంచి అవసరమైన క్లియరెన్స్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Air India Tickets: అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలసిందే. అయితే ఇప్పటికే ఎయిర్ ఇండియాకు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు, ఇక నుంచి నగదు చెల్లించి ఎయిర్ ఇండియా టికెట్లు కొనుగోలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా చదవండి ...

అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఎయిర్ ఇండియాను(Air India) టాటా గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలసిందే. అయితే ఇప్పటికే ఎయిర్ ఇండియాకు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు, ఇక నుంచి నగదు చెల్లించి ఎయిర్ ఇండియా టికెట్లు కొనుగోలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నగదుతో టికెట్లు కొనుగోలు చేసుకోవాలని ఆర్థిక శాఖ (Finance) తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఇచ్చే ఎల్ టీ సీ ( లీవ్ ట్రావెల్ కన్సెషన్) టికెట్లను 2009 నుంచి కేవలం ఎయిర్ ఇండియా సంస్థవేకొనాలని ఆదేశాలు కూడా ఉన్నాయి.

Huzurabad: ఒక్కో ఇంటికి రూ.24 వేలు.. బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంచుతున్న నేతలు.. వీడియో వైరల్..


అయితే బకాయిలు పేరుకుపోవంతో ఎయిర్ ఇండియాకు అప్పులు పెరిగిపోయాయి. వీటికి తోడు వీవీఐపీలుకూడా ఎయిర్ ఇండియాలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. వారి బకాయిలు కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయాయని, దీంతో వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తలెత్తుతున్నాయని సంస్థ అధికారులు తెలిపారు.

అయితే,తాజాగా ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు అమ్ముతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒప్పందం చేసుకుంది. ఎయిర్ ఇండియాను టాటా గ్రూపురూ.18000 కోట్లకు దక్కించుకుంది. టాటా సన్స్ అనుబంధ సంస్థ టెలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ ఇండియాను గత నెలలో దక్కించుకుంది. రూ.2700 నగదు చెల్లించడంతోపాటు, ఎయిర్ ఇండియాకు ఉన్న బాకీలు రూ.15,300 కోట్లు టాటా అనుబంధ సంస్థకు బదలాయించనున్నారు.

Huzurabad By Elections: అతడి వైపే మొగ్గుచూపుతున్న బెట్టింగ్ రాజాలు.. 20 వేల మెజారిటీ పక్కా అంటూ..


ఎయిర్ ఇండియాకు ఘనచరిత్ర..

స్వాతంత్రం రాక పూర్వం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాకు మంచి గుర్తింపు ఉంది. ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ అయిన సమయాన్ని చూసి తమ గడియారాల్లో ప్రయాణీకులు సమయం సెట్ చేసుకునే వారట. అంటే ఎయిర్ ఇండియా విమానాలు అంత ఖచ్ఛితమైన సమయం పాటించేవన్న మాట. రాను రాను ఎయిర్ ఇండియా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక సంస్కరణల ఫలితంగా అనేక ప్రైవేటు విమానయాన సంస్థలు రంగంలోకి దిగడంతో, వాటి పోటీని ఎయిర్ ఇండియా తట్టుకోలేకపోయింది.

PMJDY: జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లకు శుభవార్త.. ఇలా చేస్తే రూ. 2.30 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. వివరాలివే..


దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాకు పెద్ద ఎత్తున బకాయి పడి ఉండటం, సిబ్బంది సమస్యలు ఇవన్నీ ఎయిర్ ఇండియాను అప్పుల్లోకి నెట్టాయి. స్వాతంత్రం రాక పూర్వం ఎయిర్ ఇండియా సంస్థ టాటాలకు చెందిన ప్రైవేటు కంపెనీ. స్వాతంత్రం వచ్చాక దాన్ని కేంద్రం స్వాధీనం చేసుకుంది. ఎయిర్ ఇండియా అమ్మకానికి నిర్వహించిన బిడ్డంగ్ లో మరలా టాటా గ్రూపు చేతిలోకి ఎయిర్ ఇండియా వెళ్లిపోయింది. అంటే ఎయిర్ ఇండియాకు మంచి రోజులు వచ్చాయని భావించవచ్చు.

First published:

Tags: Air India, Flight tickets

ఉత్తమ కథలు