• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CLASS 5 STUDENT LEARNS HACKING FROM YOUTUBE DEMANDS RS 10 CRORE FROM FATHER KRS

యూట్యూబ్​లో చూసి పిల్లాడి హ్యాకింగ్​.. తండ్రికే బెదిరింపు, రూ.10కోట్లు ఇవ్వకుంటే ఆ ఫొటోలు బయటపెడతానంటూ

యూట్యూబ్​లో చూసి పిల్లాడి హ్యాకింగ్​.. తండ్రికే బెదిరింపు, రూ.10కోట్లు ఇవ్వకుంటే ఆ ఫొటోలు బయటపెడతానంటూ

ప్రతీకాత్మక చిత్రం

Hacking: యూట్యూబ్​ (YouTube)లో చూసి హ్యాకింగ్​ నేర్చుకున్న ఆ పిల్లాడు ఏకంగా తండ్రినే బెదిరించాడు. రూ.10కోట్లు డిమాండ్ చేశాడు. అసలు ఈ విషయం ఎలా బయటపడిందంటే..

  • Share this:
    ఆ పిల్లాడు 11 ఏళ్లకే యూట్యూబ్​లో చూసి హ్యాకింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత రూ.10కోట్లు ఇవ్వాలని తండ్రికే ఫోన్ చేసి బెదిరించాడు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే కుటుంబ పర్సనల్ ఫొటోలు, వివరాలు ఆన్​లైన్​లో పెట్టేస్తానని భయపెట్టాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​లో జరిగింది.

    రూ.10కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు కాల్ వచ్చాక ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే హ్యకర్ తన ఈమెయిల్ పాస్ వర్డ్​తో పాటు మొబైల్ నంబర్​ లింక్​ను మార్చేశాడని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత భారీ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెయిల్స్ వచ్చాయని ఆ తండ్రి చెప్పాడు. తననే కాకుండా కుటుంబాన్ని కూడా ఆ హ్యకర్ వేధించాడని  ఫిర్యాదులో పేర్కొన్నాడు.

    విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాకింగ్ విషయాలు తెలిశాయి. హ్యాకింగ్ చేసేందుకు వినియోగించిన ఐనేరపీ అడ్రస్ ఆ తండ్రి ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వారెవరూ ఆ మెయిల్ పంపి ఉంటారని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరినీ పోలీసులు విచారించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి 11ఏండ్ల కుమారుడు  నేరం చేసినట్టు అంగీకరించాడు.

    సైబర్​ క్రైమ్స్​ ఎలా చేయాలన్నది యూట్యూబ్ చూసి నేర్చుకున్నానని 5వ తరగతి చదువుతున్న ఆ పిల్లాడు చెప్పాడు. అలాగే ఇలాంటి హ్యాకింగ్​కు పాల్పడి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకున్నానన్నాడు. అలాగే యూట్యూబ్​లో చూసి హ్యాకర్​ స్కిల్స్​ విపరీతంగా పెంచుకున్న  ఆ పిల్లాడు.. తండ్రికే బెదిరింపు మెయిల్స్ చేశాడు.

    ఈ విషయంలో పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్​తో పాటు బెదిరించడం, మహిళలను అవమానించడం తదితర కేసులు పెట్టినట్టు వెల్లడించారు. మరింత విచారణ చేస్తామన్నారు.

    ఇటీవలి కాలంలో హ్యాకింగ్ సమస్య తీవ్రమవుతోంది. ఎక్కడో కూర్చొని హ్యాకర్లు డేటాను అపహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తుంటే.. మరొకొందరు మాత్రం హ్యాకర్లకు డబ్బు చెలించి అన్యాయానికి గురవుతున్నారు.
    Published by:Krishna P
    First published:

    అగ్ర కథనాలు