హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Student : పరీక్ష పాస్ చేయండి సార్.. ఎగ్జామ్ పేపర్ కి రూ.500 పిన్ చేసిన స్టూడెంట్,చివరికి..

Student : పరీక్ష పాస్ చేయండి సార్.. ఎగ్జామ్ పేపర్ కి రూ.500 పిన్ చేసిన స్టూడెంట్,చివరికి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Student staples Rs 500 note with answer sheet : గుజరాత్ ఇంటర్మీడియట్ పరీక్షల(Gujarat intermediate board exams) వేళ అతితెలివి ప్రదర్శించిన ఓ విద్యార్థి(Student)కి ఊహించని షాక్ ఎదురైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Student staples Rs 500 note with answer sheet : గుజరాత్ ఇంటర్మీడియట్ పరీక్షల(Gujarat intermediate board exams) వేళ అతితెలివి ప్రదర్శించిన ఓ విద్యార్థి(Student)కి ఊహించని షాక్ ఎదురైంది. ఏడాది పాటు పరీక్షలు రాసేందుకు వీలు లేకుండా అతడిని డీబార్ చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం రాసిన పరీక్షలో కూడా అతడిని ఫెయిల్ చేశారు. అయితే అతడితో పాటు అతడి తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఆ విద్యార్థి అతి తెలివి ప్రదర్శించకుండా ఉంటే ఎగ్జామ్ లో పాస్ అయ్యి ఉండేవాడు,తల్లిదండ్రులు కూడా సంతోషపడేవారు.

అసలేం జరిగిందంటే

సెంట్రల్ గుజరాత్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి 12వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ ఏడాది జరిగిన బోర్డు పరీక్షలకు అతడు సరిగా ప్రిపేర్ అవ్వలేదు. దీంతో ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాననోమో అని భయంతో అతి తెలివి ప్రదర్శించాడు. కెమిస్ట్రీ,ఫిజిక్స్ ఎగ్జామ్ రాసే సమయంలో ఆన్సర్ పేపర్ లోపల రూ. 500 నోటుని కరిపించి "దయచేసి నన్ను పాస్ చేయండి"అని ఎగ్జామినర్ ని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే పేపర్లు దిద్దే సమయంలో(Assessment of answer sheets)టీచర్లు ఆన్సర్ షీట్ లో రూ.500 నోటుని గుర్తించారు. దీంతో వారు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిబంధనల ప్రకారం సదరు విద్యార్థిని వివరణ కోసం గుజరాత్ సెకండరీ ఎగ్జామినేషన్ బోర్డుకి చెందిన ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ కమిటీ పిలిపించింది. కమిటీ ముందు విద్యార్థి తాను చేసిన తప్పుని అంగీకరించాడు. ఆన్సర్ ఫీటుకి డబ్బుల నోట్లు కరిపిస్తే పాస్ చేస్తారని తాను ఎవరో అనుకుంటుంటే విన్నానని,అందుకే ఇలా చేసినట్లు తెలిపాడు. అయితే ఇది ఎగ్జామినర్ కి లంచం ఇవ్వడం అనే విషయం తనకు తెలియదని తెలిపాడు. దీంతో ఏడాది పాటు విద్యార్థి బోర్డు పరీక్షలు రాయకుండా అధికారులు నిషేధం విధించారు. అంతేకాకుండా ప్రస్తుత ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ చేశారు.

Intresting : 20 రూపాయల కోసం 22 ఏళ్ల పాటు రైల్వేపై పోరాటం..చివరికి దక్కింది రూ.73!

ఈ విషయమై ఓ అధికారి ఒకరు మాట్లాడుతూ..విద్యార్థి పర్ఫార్మెన్స్ ఏమీ అంత దారుణంగా లేదని,అతడి స్కోరు ఆ రెండు సబ్జెక్టులో 27-29 వరకు వచ్చి ఉండేవని..పేపర్లు దిద్దేవారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేయకుండా ఉండి ఉంటే గ్రేస్ మార్కులతో అతడు పాస్ అయ్యి ఉండి ఉండేవాడేమో"అని తెలిపారు.

First published:

Tags: Bribe, College student, Gujarat

ఉత్తమ కథలు