హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Heart Attack: ఎగ్జామ్‌కు ముందు గుండెపోటు! పదో తరగతి స్టూడెంట్ మృతి

Heart Attack: ఎగ్జామ్‌కు ముందు గుండెపోటు! పదో తరగతి స్టూడెంట్ మృతి

 (ప్రతీకాత్మక చిత్రం -Image credit pixabay)

(ప్రతీకాత్మక చిత్రం -Image credit pixabay)

ఫ్రెండ్స్‌మీద, ఎగ్జామ్‌ పేపర్‌మీదా జోక్స్‌ వేసింది.. ఇంతలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో ఫ్రెండ్స్‌కు అసలు అర్థంకాలేదు.. ఆమెను లేపేందుకు చాలా ప్రయత్నించారు.. అయినా ఆమెలో ఏ మాత్రం చలనం లేదు..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

లాస్ట్ ఎగ్జామ్‌ గురించి ఫ్రెండ్స్‌తో ఎప్పటిలాగానే డిస్కషన్‌ పెట్టింది. ఇప్పటివరకు అన్నీ ఎగ్జామ్స్‌ బాగా రాసినట్లు చెప్పింది. అంతా రిలెక్స్‌డ్‌గానే మాట్లాడింది.. ఫ్రెండ్స్‌మీద, ఎగ్జామ్‌ పేపర్‌మీదా జోక్స్‌ వేసింది.. ఇంతలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో ఫ్రెండ్స్‌కు అసలు అర్థంకాలేదు.. ఆమెను లేపేందుకు చాలా ప్రయత్నించారు.. అయినా ఆమెలో ఏ మాత్రం చలనం లేదు.. వెంటనే గమనించిన చుట్టుపక్కాల వాళ్లు ఆమెను ఆస్పత్రికి తరలించారు.. ఈ విషయాన్ని అప్పటికే వాళ్ల ఫ్రెండ్స్‌ ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పారు.. ఆస్పత్రికి చేరుకున్న వాళ్లు.. అక్కడి సిబ్బంది చెప్పిన మాటకు మొదట షాక్‌కు గురయ్యారు. తర్వాత గుండెలు పగిలేలా రోదించారు..

పదో తరగతి విద్యార్థినికి గుండెపోటు:

మహారాష్ట్రలోని ఇందాపూర్ నారాయణదాస్ రాందాస్ హైస్కూల్‌లో పదో తరగతి సృష్టి ఏకాద్ పదో తరగతి చదువుతోంది. ఆమె వయసు 16. ప్రస్తుతం పరీక్షా కాలం కావడంతో ఆమె ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది. మార్చి 13న చివరి ఎగ్జామ్‌ రాయాల్సి ఉంది. మార్చి 12న ఫ్రెండ్స్‌తో ఎప్పటిలానే సరదాగా మాట్లాడింది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పదో తరగతి చదువుతున్న స్టూడెంట్‌.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఓ విద్యార్థికి గుండెపోటు రావడం అక్కడున్నవారిని షాక్‌కు గురిచేసింది. అసలు ఆమెకు గుండెపోటు ఎందుకు వచ్చిందన్నది అంతుబట్టడంలేదు. ఇటీవలి కాలంలో ఇలా చిన్న వయసు వారికి గుండెపోటు రావడం ఇదే తొలిసారి కాదు. యువకులు గుండెపోటుతో కుప్పకూలి చనిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఒకరి తర్వాత ఒకరు:

గత వారం పుణెలోని మరుంజిలోని మామాసాహెబ్ మొహల్ కుస్తీ సంకుల్‌లో స్వప్నిల్ పడాలే అనే రెజ్లర్ వర్కవుట్ చేస్తూ మరణించాడు. జిమ్‌లో కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఇటు మన తెలుగు రాష్ట్రాల్లోనూ గుండెపోటుతో చనిపోతున్న యువత సంఖ్య పెరుగుతోంది. ఇక రెండు రోజుల అమెరికాలో తెలుగు విద్యార్థి హఠాన్మరణం చెందాడు. 23 ఏళ్ల బొడగల వంశీ రెడ్డయ్య అనే విద్యార్థి కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందాడు. అయితే ఈ జిమ్‌ వర్క్‌వుట్స్‌ తర్వాత గుండెపోటుకు స్టెరాయిడ్స్ కూడా ఓ కారణం కావొచ్చంటున్నారు డాక్టర్లు. అయితే అసలు స్టెయిరాడ్స్‌ ఉపయోగించని వాళ్లు.. ఎలాంటి హెల్త్‌ ప్రాబ్లెమ్స్‌ లేని వాళ్ల గుండె ఎందుకు ఆగిపోతుందో చెప్పలేపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పట్టుమని పాతికేళ్లు కూడా లేని వాళ్లు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

First published:

Tags: Heart Attack, Maharashtra, Pune, Student

ఉత్తమ కథలు