సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి వస్తారనితుది తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3:2 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం.


Updated: November 13, 2019, 3:05 PM IST
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ
సుప్రీంకోర్టు
  • Share this:
దశాబ్దాల నాటి అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. తాజాగా మరో సంచలన తీర్పుకు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి వస్తారనితుది తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3:2 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ హైకోర్టును తీర్పును పూర్తిగా సమర్థించింది. పారదర్శకత, జవాబుదారీతనానికి న్యాయ స్వాతంత్ర్యం అడ్డు కాకూడదని స్పష్టం చేసింది. గోప్యతను, పారదర్శకతను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాగా, 2010లో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టుతో పాటు సీజేఏ ఆఫీసులు కూడా ప్రభుత్వ సంస్థలేనని.. అవి ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అప్పీల్‌కు వెళ్లారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా తుది తీర్పును వెల్లడించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు.


First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు