Home /News /national /

CJI RANJAN GOGOI TO OFFER PRAYERS AT TIRUMALA TEMPLE ON SUNDAY MORNING NK

Ranjan Gogoi : సాయంత్రం తిరుమలకు సుప్రీం ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్...

జస్టిస్ రంజన్ గొగోయ్

జస్టిస్ రంజన్ గొగోయ్

Ranjan Gogoi : సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రెస్‌గా గుర్తింపు పొందిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్... ఆదివారం రిటైర్మెంట్ తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు.

   CJI Ranjan Gogoi : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నో సంక్లిష్టమైన కేసుల్లో సంచలన చరిత్రాత్మక తీర్పులు, విశేష సేవలు అందించిన జస్టిస్ రంజన్ గొగోయ్... నేటి సాయంత్రం తిరుమల చేరుకుంటారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతారు. ఆదివారమే ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో రిటైర్మెంట్ తీసుకోనున్నారు. కోర్టు పనిదినమైన శుక్రవారం ఆయనకు చివరి పనిదినం అయ్యింది. ఆ రోజు కూడా ఆయన మూడు కీలక కేసులకు (రాఫెల్ డీల్, శబరిమలలో మహిళల ప్రవేశం, రాహుల్ చౌకీదార్ వ్యాఖ్యలు) తీర్పులు, పరిష్కారాలు ఇచ్చి... తన నిబద్ధతను చాటుకున్నారు. అన్నిటికంటే కీలకమైన అయోధ్య రామ జన్మభూమి వివాదం కేసులో కీలక తీర్పు ఇచ్చిన ఆయన... ఇప్పుడు తిరుమలకు వస్తుండటంతో... టీటీడీ పాలక మండలి, పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

  జస్టిస్ రంజన్ గొగోయ్


  తిరుగులేని న్యాయమూర్తి : సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా 2018 అక్టోబర్​3న అంటే... 13 నెలల కిందట బాధ్యతలు చేపట్టారు జస్టిస్ రంజన్ గొగోయ్. ఆయన ఛీఫ్ జస్టిస్ అవుతున్నారని తెలియగానే... దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఎందుకంటే... రంజన్ గొగోయ్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. కేసులపై నాన్చుడు ధోరణి అంటే ఆయనకు ఏమాత్రం నచ్చదు. అలాగని హడావుడిగా తీర్పు ఇచ్చేసి... న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని తగ్గింటే వ్యవహార శైలి ఆయనకు లేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయోధ్య కేసులో ఆయన అధ్యక్షతనలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పే. ఆ తీర్పు వెలువడిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఫుల్ అలర్ట్ అయ్యాయి. కానీ... తీర్పు చెప్పిన విధానం, వెలువరించిన పద్ధతీ... అన్నీ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారినీ ఆలోచనలో పడేశాయి. అందరూ ఆమోదించేలా తీర్పును ఇవ్వడం జస్టిస్ రంజన్ గొగోయ్‌కే చెల్లిందని అనుకోవచ్చు.

  జస్టిస్ రంజన్ గొగోయ్


  గొగోయ్ ఘన చరిత్ర : 1954 నవంబర్​18న పుట్టిన రంజన్​గొగోయ్... అసోం మాజీ ముఖ్యమంత్రి కేశవ్​చంద్ర గొగోయ్​తనయుడు. 1978లో ‘బార్’లో చేరి... గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001లో శాశ్వత జడ్జి అయ్యారు. 2010​లో పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టుకి బదిలీపై వచ్చారు. 2011లో ఛీఫ్​జస్టిస్‌గా నియమితులయ్యారు. 2012​లో ప్రమోషన్‌పై సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చారు. అప్పటి నుంచీ రంజన్ గొగోయ్ అంటే... సాదాసీదా జడ్జి కాదని నిరూపిస్తూ... న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతూ పోయారు. ఓ సందర్భంలో మీడియా ముందుకు వచ్చి... న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని అభ్యంతరాలు తెలిపారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆయనపై కొన్ని విమర్శలు, ఆరోపణలూ వచ్చినా... అవన్నీ కాలక్రమంలో పటాపంచలయ్యాయి. దేశంలో అవినీతి, అక్రమాలు, నేరాల వంటివి పెరుగుతున్నా... న్యాయవ్యవస్థపై ఇప్పటికీ ప్రజల్లో నమ్మకం సడలిపోలేదంటే... అందుకు జస్టిస్ రంజన్ గొగోయ్ లాంటి న్యాయమూర్తులే కారణం అని చెప్పుకోవచ్చు.

  జస్టిస్ రంజన్ గొగోయ్


  మార్పులకు శ్రీకారం : జస్టిస్ రంజన్ గొగోయ్... సూటిగా సుత్తిలేకుండా విషయాన్ని కుండబద్ధలు కొట్టే రకం. 2014లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చినా... కేంద్రం... సుప్రీంకోర్టు మాట వినాల్సిందేనంటూ... NRC (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజెన్స్) పౌరసత్వ గుర్తింపు ప్రక్రియను మూడేళ్లలో పూర్తిచేయాలని ఆదేశించారు. గొగోయ్ ఇలాంటివి చాలా చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల్ని వేగంగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని తెచ్చారు. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్యను 31 నుంచీ 34కి పెంచారు. ఎక్కువ మంది హైకోర్టు చీఫ్​జస్టిస్‌లకు సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ ఇచ్చిన రికార్డ్ కూడా రంజన్ గొగోయ్​పేరున ఉంది. తాజాగా పిటిషన్ల బదిలీ కేసుల్లో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సింగిల్​జడ్జికే అప్పగించారు. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు-చేర్పులతో... తన పదవీకాలాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడం గొగోయ్‌కే చెల్లిందంటారు న్యాయనిపుణులు. రిటైర్మెంట్ తర్వాత ఆయన జస్టిస్ రంజన్ గొగోయ్ గౌహతిలోనే ఉండనున్నారు.


  Pics : ఆగ్రా అందాల బ్యూటీ ఆషీ సింగ్ క్యూట్ స్టిల్స్
  ఇవి కూడా చదవండి :

  Video : పోలీసుల్ని పరుగులు పెట్టించిన మొసలి పిల్ల

  Food : వెల్లుల్లి రొయ్యల కర్రీ... ట్రై చేశారా... చాలా ఈజీ...

  టీ10 లీగ్‌లో సందడి చేసిన సన్నీలియోన్

  వావ్... స్ట్రీట్ డాన్స్ ఇరగదీసిన నోరా ఫతేహి

  పులి చర్మం డ్రెస్‌లో ఇలియానా... సోషల్ మీడియా షేక్...
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: CJI Ranjan Gogoi, Ranjan Gogoi, Supreme Court, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు