హోమ్ /వార్తలు /జాతీయం /

Ayodhya : దసరా తర్వాతే అయోధ్య విచారణ పూర్తి.. సుప్రీం చీఫ్ జస్టిస్ వెల్లడి..

Ayodhya : దసరా తర్వాతే అయోధ్య విచారణ పూర్తి.. సుప్రీం చీఫ్ జస్టిస్ వెల్లడి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ayodhya Dispute | భారత దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ జన్మ భూమి కేసులో విచారణ అక్టోబరు 18 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు.

    భారత దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ జన్మ భూమి కేసులో విచారణ అక్టోబరు 18 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించే ప్యానెల్‌కు కోర్టు ఇంకా ద్వారాలు తెరిచే ఉందని స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించాలని కొన్ని వర్గాలు తనను అభ్యర్థిస్తున్నట్లు న్యాయమూర్తి ఖలీఫుల్లా తనకు లేఖ రాశారని గుర్తు చేశారు. ‘అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంపై న్యాయస్థానం ఆశతో ఉంది. దానికోసం మనమంతా కలిసి కృషిచేద్దాం’ అని గొగోయ్ అన్నారు. ఇదిలా ఉండగా, అయోధ్య కేసుపై ఆగస్టు 7న రోజూవారీ విచారణ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.


    ఈ కేసు విచారణలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఇరువర్గాల వాదనను వింటోంది. సుప్రీం విచారణకు ముందు అలహాబాద్ హైకోర్టు.. 2.77 ఎకరాల భూమికి సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖారా అండ్ రామ్ లాలాకు సమానంగా పంచాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 14 పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి.

    First published:

    Tags: Ayodhya, Ayodhya Ram Mandir, CJI Ranjan Gogoi, Supreme, Supreme Court, Uttar pradesh