Home /News /national /

CJI RANJAN GOGOI RECUSES FROM HEARING PLEA AGAINST APPOINTMENT OF NAGESWARA RAO AS ACTING CBI CHIEF

సీబీఐ వివాదంలో కొత్త ట్విస్ట్...వైదొలగిన ప్రధాన న్యాయమూర్తి

న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఫైల్ ఫోటో..

న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఫైల్ ఫోటో..

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వర్‌ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించనున్న బెంచ్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వైదొలిగారు.

    సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వర్‌ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించనున్న బెంచ్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వైదొలిగారు. అలోక్ వర్మ స్థానంలో సీబీఐ కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసే ఉన్నతస్థాయి కమిటీలో తాను సభ్యు అలోక్ వర్మ స్థానంలో సీబీఐ కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేసే ఉన్నతస్థాయి కమిటీలో తాను సభ్యుడిగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంజన్ గొగోయ్ తెలిపారు. డిగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంజన్ గొగోయ్ తెలిపారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిన కేంద్ర ప్రభుత్వం, ఆయన స్థానంలో నాగేశ్వర్ రావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అలోక్ వర్మ మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొన్ని రోజుల వ్యవధిలోనే కేంద్రం అలోక్ వర్మను ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో రెండోసారి నాగేశ్వర రావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది.

    నాగేశ్వర రావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సదరు ఎన్జీవో తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వర రావును నియమించడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, దురుద్దేశపూర్వకం, ఢిల్ల పోలీస్ నిబంధనల అతిక్రమణగా న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనల మేరకు సీబీఐ‌కి పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని ఎన్జీవో తన పిటిషన్‌లో కోరింది.
    First published:

    Tags: Alok Verma, CBI, CJI Ranjan Gogoi, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు