హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కేంద్రంపై సుప్రీం కోర్టు అసహనం.. ‘మా సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ..’ ఎందుకంటే..

కేంద్రంపై సుప్రీం కోర్టు అసహనం.. ‘మా సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ..’ ఎందుకంటే..

5. చనిపోయిన హిందూ పురుష వ్య‌క్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం తెలిపింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5. చనిపోయిన హిందూ పురుష వ్య‌క్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం తెలిపింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Supreme Court on Tribunal Vacancies | దేశంలోని వివిధ ట్రైబ్యునల్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు ఎండగట్టింది. కేంద్ర ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి ...

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) మండిపడింది. ట్రైబ్యునల్స్‌లో ఖాళీలను (Vacencies in Tribunals) వెంటనే భర్తీ చేయాలని ఆదేశించింది. దేశంలోని వివిధ ట్రైబ్యునల్స్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో  సర్వోన్నత న్యాయస్థానం అసహనాన్ని వ్యక్తం చేసింది. ట్రైబ్యునల్స్‌లో ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి వారం రోజుల గడువు విధించింది. ఖాళీల భర్తీకి సంబంధించి జరిగిన విచారణలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేం చాలా అసంతృప్తిగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును గౌరవిస్తున్నట్టు కనిపించడం లేదు. మీరు (కేంద్రం) మా సహనాన్ని పరీక్షిస్తున్నారు.’ అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రంతో తాము ఘర్షణకు దిగాలనుకోవడం లేదని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో వేగంగా స్పందించిన తీరును ఆయన ప్రస్తావించారు.

‘కేంద్రంలోని కొన్ని ప్రముఖ ట్రిబ్యునల్స్‌ అయిన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ లాంటి వాటిలో కూడా ఖాళీలు ఉన్నాయి. అవి ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైనవి. సైనిక దళాలు, వినియోగదారుల ట్రైబ్యునల్స్‌లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. దాని వల్ల చాలా కేసుల పరిష్కారం ఆలస్యం అవుతోంది.’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ముఖ్యమంత్రి తండ్రిపై కేసు నమోదు.. సీఎం ఏమన్నారంటే..


ట్రైబ్యునల్స్‌లో ఖాళీలను భర్తీచేయడానికి కనీసం రెండు నెలలు పడుతుందంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినట్టు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు మండిపడింది. ‘ఖాళీలు ఇప్పుడు కాదు. రెండేళ్లుగా ఉన్నాయి. ఇంకా ఎందుకు వాటిని భర్తీ చేయలేదు. మీరు (కేంద్రం) ట్రైబ్యునల్స్‌ను జావగారుస్తున్నారు.’ అని జస్టిస్ లావు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

విశాఖపట్నం ఎయిర్ పోర్టు వాళ్లకు అప్పగిస్తాం.. ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇక ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టం ఒక ప్యాట్రన్‌లా మారిపోయిందని మరో జస్టిస్ డీవై చంద్రచూడ్ కామెంట్ చేశారు. ‘ఇదో పద్ధతి అయిపోయింది. మేం ఒకదాన్ని కొట్టేస్తే మరోదాన్ని తీసుకొస్తున్నారు.’ అని ఆయన అన్నారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మూడు ఆప్షన్లు ఇచ్చారు.


  1. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టాన్ని కొనసాగించి వెంటనే ఖాళీలను భర్తీ చేయడం.

  2. సుప్రీంకోర్టే స్వయంగా ట్రైబ్యునల్స్‌ను మూసేయడం

  3. ట్రైబ్యునల్స్‌‌లో ఖాళీలను కూడా సుప్రీంకోర్టే భర్తీ చేయడం


ఈ మూడు ఆప్షన్లు కాకుండా కేంద్రం మీద కోర్టు ధిక్కరణ ఆప్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హెచ్చరించారు. కాబట్టి వారం రోజుల్లో ట్రైబ్యునల్స్‌లో ఖాళీలను భర్తీ చేయాలని గడువు విధించారు. ట్రైబ్యునల్స్‌లో ఖాళీల భర్తీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ వేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కేంద్రం మీద ఈ కామెంట్స్ చేసింది.

First published:

Tags: Central Government, NV Ramana, Supreme Court

ఉత్తమ కథలు