కోర్టుల్లో మహిళా న్యాయమూర్తులు (women judges) చాలా తక్కువ మంది ఉన్నారని, న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు (reservations) ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI NV Ramana) అభిప్రాయపడ్డారు. అంతేకాదు దేశ వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో (law colleges)నూ ఇలాంటి రిజర్వేషన్లకు ఆయన మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తనతోపాటు కొత్తగా న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన 9 మంది జడ్జీలకి సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీజేఐ రమణ (CJI Ramana) ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది మీ హక్కు. ఆ రిజర్వేషన్లను మీరు డిమాండ్ (demand) చేయాలి అని రమణ వాళ్లకు సూచించారు. 50 శాతం రిజర్వేషన్ కల్పించడం అత్యవసరమని.. అలాగే లా కాలేజీల్లో కూడా అనుమతించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నానంటూ పేర్కొన్నారు.
22 శాతం కోర్టుల్లో మరుగుదొడ్లు లేవు..
కోర్టుల్లో మహిళా న్యాయవాదులు అనేక సమస్యలు (problems) ఎదుర్కొంటున్నారని రమణ అన్నారు. న్యాయస్థానాల్లో మహిళా న్యాయవాదులకు మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. దేశంలోని 22 శాతం కోర్టుల్లో మరుగుదొడ్లు (toielts) లేవని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల సమస్యల (women problems) పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
15 శాతం మాత్రమేనా..
‘‘న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలి. ఇది వేల సంవత్సరాల అణచివేతకు సంబంధించిన సమస్య. న్యాయవ్యవస్థ (law system) కింది స్థాయిలో 30 శాతం కంటే తక్కువ మంది మహిళలు జడ్జీలుగా ఉన్నారు. హైకోర్టులలో ఇది కేవలం 11.5 శాతం. సుప్రీంకోర్టులో 11-12 శాతం మాత్రమే అని రమణ అన్నారు. ఇక దేశవ్యాప్తంగా 17 లక్షల మంది న్యాయవాదులు ఉంటే.. కేవలం 15 శాతం మంది మాత్రమే మహిళలు.” అని సీజేఐ అన్నారు.
రాష్ట్రాల బార్ కౌన్సిల్స్‌లో (bar council) మహిళల నుంచి రెండు శాతం మందే ప్రతినిధులుగా ఉన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ కమిటీలో ఒక్క మహిళ (no women) కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నించాను అని సీజేఐ రమణ అన్నారు. ఈ అంశాలపై తక్షణమే స్పందించాల్సిన (should answer) అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. డాటర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. ఇది అమెరికా సంస్కృతి అయినా.. కొన్ని మంచి విషయాలను ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకోవాలని రమణ అన్నారు.
దసరా అనంతరం ప్రత్యక్షంగా కోర్టుల్లో విచారణ..
దసరా అనంతరమే కోర్టుల్లో ప్రత్యక్ష విచారణకు అనుమతిస్తామని సీజేఐ పేర్కొన్నారు. కోర్టులు తెరవడం వల్లనే కరోనా థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వచ్చాయని ప్రజలు అనవచ్చని.. అందుకే థర్డ్ వేవ్, ఫోర్త్‌వేవ్‌లు రాకూడదని ఆశిద్దామంటూ ఎన్వీ రమణ అన్నారు. దసరా అనంతరం ప్రత్యక్ష విచారణకు అనుమతించవచ్చంటూ ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష విచారణతో న్యాయమూర్తులకు ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. న్యాయవాదులు, ఇతర సిబ్బందికే ఇబ్బందులు ఉంటాయని రమణ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NV Ramana, Reservations, Women, Women's Reservation Bill