ప్రియురాలి కోసం సివిల్స్ టాపర్ అయ్యాడు...యూపీఎస్‌సీ టాప్ ర్యాంకర్ లవ్‌స్టోరీ....

సివిల్స్ లో టాప్ సాధించేందుకు తన గర్ల్ ఫ్రెండ్ చాలా బాగా హెల్ప్ చేసిందని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

news18-telugu
Updated: April 9, 2019, 9:33 PM IST
ప్రియురాలి కోసం సివిల్స్ టాపర్ అయ్యాడు...యూపీఎస్‌సీ టాప్ ర్యాంకర్ లవ్‌స్టోరీ....
సివిల్స్ లో టాప్ సాధించేందుకు తన గర్ల్ ఫ్రెండ్ చాలా బాగా హెల్ప్ చేసిందని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
  • Share this:
సివిల్స్ టాపర్ కనిష్క్ కటారియా లవ్‌స్టోరీ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. తాను సివిల్స్ లో టాప్ సాధించేందుకు తన గర్ల్ ఫ్రెండ్ చాలా బాగా హెల్ప్ చేసిందని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. యూపీఎస్‌సీ 2019లో టాప్ ర్యాంక్ సాధించిన కనిష్క్ ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేశాడు. రాజస్థాన్ కు చెందిన కనిష్క్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నేపథ్యం నుంచి రావడం విశేషం. ప్రస్తుతం కనిష్క్ డేటా సైంటిస్ట్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే సివిల్స్ రిజల్ట్స్ వెలువడిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తన తల్లిదండ్రులతో పాటు గర్ల్ ఫ్రెండ్‌కు కూడా థ్యాంక్స్ చెబుతున్నానని కనిష్క్ చెప్పడం సంచలనంగా మారింది. అయితే కనిష్క్ చేసిన ఈ బోల్డ్ స్టేట్ మెంట్‌ను సపోర్ట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్ చేయడం విశేషం.

ఇదిలా ఉంటే కనిష్క్ కటారియా సివిల్స్ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించడం పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుభాకాంక్షలు తెలియజేశారు. కనిష్క్ కటారియా వయస్సు కేవలం 26 సంవత్సరాలు కావడమే విశేషం. 2017లో సౌత్ కొరియాకు చెందిన కంపెనీకి రిజైన్ చేసి సివిల్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టినట్లు తెలిపాడు. ఢిల్లీలో సివిల్స్ ప్రిపరేషన్ లో భాగంగా రోజుకు 8 నుంచి 10 గంటలు కష్టపడినట్లు తెలిపాడు.

 
First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...