ఈశాన్య రాష్ట్రాల్లో 5వేల పారా మిలటరీ బలగాల మోహరింపు

ఈశాన్య రాష్ట్రాల్లో వేలాది మంది నిరసనకారులు రోడ్డెక్కడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది. నిరసనకారుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారు.

news18-telugu
Updated: December 11, 2019, 4:52 PM IST
ఈశాన్య రాష్ట్రాల్లో 5వేల పారా మిలటరీ బలగాల మోహరింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా అసోం,మణిపూర్,త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో శాంతిభద్రతలపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో దాదాపు 5వేల పారామిలటరీ దళాలను కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించింది. కశ్మీర్ నుంచి 20 కంపెనీల మిలటరీ దళాలను ఉపసంహరించి.. ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించారు.ఇందులో సీఆర్పీఎఫ్,బీఎస్ఎఫ్,ఎస్ఎస్‌బీ భద్రతా దళాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వేలాది మంది నిరసనకారులు రోడ్డెక్కడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టతరంగా మారింది. నిరసనకారుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. అయినప్పటికీ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో కేంద్రం పారా మిలటరీ దళాలను మోహరించాల్సి వచ్చింది.

కాగా,పాకిస్తాన్,బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చినవారికి పౌరసత్వాన్ని కల్పించడాన్ని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వలసొచ్చినవారికి పౌరసత్వాన్ని కల్పించడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఇది తమ అస్తిత్వానికి భంగం కలిగించే చర్యగా వారు పరిగణిస్తున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: December 11, 2019, 4:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading