రేపే లోక్‌సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు..

సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది.

news18-telugu
Updated: December 8, 2019, 7:37 PM IST
రేపే లోక్‌సభ ముందుకు పౌరసత్వ సవరణ బిల్లు..
అమిత్ షా (File Photo)
  • Share this:
సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బిల్లును లోక్‌సభ బిజినెస్‌ జాబితాలో పొందుపరిచింది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 1955లో రూపొందించిన పౌరసత్వ బిల్లుకు సవరణలు చేసిన కేంద్రం.. ఉభయ సభల్లో దాన్ని ఆమోదింపజేయాలని భావిస్తోంది. తాజా సవరణల ప్రకారం ముస్లింలు మినహా బంగ్లాదేశ్,పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్‌ల నుంచి వలస వచ్చిన పౌరులకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించారు.వలసదారులుగా గుర్తించబడిన హిందువులు,క్రైస్తవులు,జైనులు,బౌద్దులు,పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు.

కాగా,పౌరసత్వ సవరణ బిల్లులో ముస్లింలను చేర్చకపోవడం వివాదానికి దారితీస్తోంది. లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును తీసుకొస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్ 14కి కేంద్రం తూట్లు పొడుస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>