నేడు లోక్‌సభలో పౌరసత్వ బిల్లు... ఆమోదం కోసం బీజేపీ విప్ వ్యూహం

ప్రతీకాత్మక చిత్రం

Citizenship Amendment Bill : ఇప్పటికే ఎన్నో సంచలన బిల్లుల్ని పాస్ చేయించుకున్న కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లును గట్టెక్కించుకునేందుకు బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది.

 • Share this:
  Citizenship Amendment Bill : కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో పౌరసత్వ (సవరణ) బిల్లు,... చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా పొడిగింపుకి సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ పౌరసత్వ సవరణ బిల్లు ఏంటి అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జనరల్‌గా భారతీయులందరికీ పౌరులుగా పౌరసత్వం ఉంటుంది. ఐతే కేంద్ర ప్రభుత్వం... పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు, వివక్షలూ తట్టుకోలేక 2014 డిసెంబర్ ఆఖరులోపు దేశంలోకి వలస వచ్చిన... ముస్లింలు కాని వారికి పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ బిల్లులో సవరణలు చేసింది. ఆ బిల్లును హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో మధ్యాహ్నం ప్రవేశపెట్టబోతున్నారు. బిల్లుపై చర్చ జరిపి... తర్వాత ఓటింగ్‌ జరుపుతారు. ఐతే ఈ బిల్లును కాంగ్రెస్ తప్పు పడుతోంది. పౌరసత్వం పేరుతో ముస్లింలకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మతాలకు అతీతంగా దేశంలోకి వచ్చిన అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపేందుకు 1971 మార్చి 24న తుది గడువుగా నిర్దేశిస్తూ కేంద్రం, ఈశాన్య రాష్ర్టాల మధ్య 1985లో కుదిరిన అసోం ఒప్పందాన్ని ఈ సవరణ బిల్లు కాలరాస్తోందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మండిపడుతున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రేపు బంద్‌‌కి పిలుపిచ్చింది ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల సమాఖ్య. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ బిల్లును ఆమోదించనివ్వకుండా కాంగ్రెస్ అడ్డుకునే అవకాశాలు ఉండటంతో... నేటి నుంచి మూడు రోజులపాటు సభకు బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేసింది పార్టీ అధిష్టానం.

  ఇక లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోటా 2020 జనవరితో ముగియనుంది. ఎలాగూ విప్ కారణంగా బీజేపీ ఎంపీలంతా లోక్‌సభలో ఉంటారు కాబట్టి ఈ బిల్లు కూడా ఆమోదం అయ్యే అవకాశాలున్నాయి. తద్వారా లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు 2030 జనవరి 25 వరకు కొనసాగనున్నాయి.


  Pics : సోలో బతుకే సో బెటర్ అంటున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్
  ఇవి కూడా చదవండి :

  పాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?

  Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

  Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


  Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు


  Health Tips : టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...

  Published by:Krishna Kumar N
  First published: