ఢిల్లీలో పౌరసత్వ బిల్లు మంటలు...మూడు బస్సులను దగ్ధం చేసిన ఆందోళనకారులు

జామియా స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో కొందరు విద్యార్ధులు విధ్వంసానికి తెగబడ్డారు. రహదారిపై నిలిపి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌కి సంబంధించిన మూడు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి.

news18-telugu
Updated: December 15, 2019, 9:00 PM IST
ఢిల్లీలో పౌరసత్వ బిల్లు మంటలు...మూడు బస్సులను దగ్ధం చేసిన ఆందోళనకారులు
ఆందోళనకారుల విధ్వంసంలో దగ్ధమైన బస్సు (Image: News18 English)
  • Share this:
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆదివారం దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్ రోడ్‌పై భారీగా ఆందోళనలు కారులు తరలివచ్చారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. జామియా స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో కొందరు విద్యార్ధులు విధ్వంసానికి తెగబడ్డారు. రహదారిపై నిలిపి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్‌కి సంబంధించిన  మూడు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి  పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. అయితే హింసాత్మక ఘటనల్లో విద్యార్థులు లేరని, వారంతా ఔట్ సైడర్స్ అని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు జామియా యూనివర్సిటీని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఈనెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే పరిస్థితిని అదుపులోకి తేవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను కోరారు.
Published by: Krishna Adithya
First published: December 15, 2019, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading