Citizenship Act: ఇండియా గేట్ వద్ద ప్రియాంక గాంధీ ధర్నా

విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం చేతకాని ప్రభుత్వం.. లాఠీలు ఝుళిపిస్తూ, బుల్లెట్లు కురిపిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: December 16, 2019, 5:34 PM IST
Citizenship Act: ఇండియా గేట్ వద్ద ప్రియాంక గాంధీ ధర్నా
ఇండియా గేట్ వద్ద ప్రియాంక గాంధీ ధర్నా
  • Share this:
Citizenship Act Protests: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్‌యూ క్యాంపస్‌లు అట్టుడుకుతున్నాయి. విద్యార్థులంతా రోడ్లపైకి చేరుకొని కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఐతే విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌కి నిరసనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలో ధర్నాకు దిగారు. విద్యార్థులకు సంఘీభావంగా ఇండియా గేట్ వద్ద బైఠాయించారు.

ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, ఏకే అంటోని, పీఎల్ పునియా, అహ్మద్ పటేల్‌ ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం చేతకాని ప్రభుత్వం.. లాఠీలు ఝుళిపిస్తూ, బుల్లెట్లు కురిపిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక ప్రియాంక ధర్నా విషయం తెలిసి విద్యార్థులు పెద్ద ఎత్తున ఇండియా గేట్‌కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా గేట్ పరిసరాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ''మోదీ ప్రభుత్వం విద్యార్థులు, యువత హక్కులను కాలరాస్తోంది. అందుకే విద్యార్థులకు సంఘీభావంగా ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది.'' అని ఆ పార్టీ అధికార ప్రతిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.

First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు