Citizenship Act: జామియా వర్సిటీలో ఉద్రిక్తత.. జర్నలిస్ట్‌లపై దాడులు

జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఐతే వారు విద్యార్థులా..బయటి వ్యక్తులా.. అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

news18-telugu
Updated: December 16, 2019, 5:11 PM IST
Citizenship Act: జామియా వర్సిటీలో ఉద్రిక్తత.. జర్నలిస్ట్‌లపై దాడులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులు
  • Share this:
Citizenship Act Protests: పౌరసత్వం చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐతే ఈ ఆందోళనల కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్ట్‌లపై ఢిల్లీలో దాడులు జరిగాయి. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఐతే వారు విద్యార్థులా..బయటి వ్యక్తులా.. అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

జామియా యూనివర్సిటీ గేట్-1 సమీపంలో ANI వార్తా సంస్థలకు చెందిన జర్నలిస్టులపై కొందరు ఆందోళనకారులు దాడి చేశారు. ఈ దాడిలో ANI రిపోర్టర్ ఉజ్వల్ రాయ్, కెమెరాపర్సన్ సరబ్జీత్ సింగ్‌కు గాయాలయ్యాయి. వారిద్దరు ప్రస్తుతం హోలి ఫ్యామిలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక అదే జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ ప్రాంగణంలో లైవ్ కవరేజీ చేస్తున్న ABP మహిళా రిపోర్టర్ ప్రతిమా మిశ్రా పట్ల కొందరు ఆందోళనకారులు అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను ఎగతాళి చేస్తూ వేధించారు. ఇంకొందరైతే కెమెరాపై చేతులు వేసి లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలను దేశంలోని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి.



First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు