హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Chinese Rocket : భారత గగనతలంలో పేలిన చైనా రాకెట్

Chinese Rocket : భారత గగనతలంలో పేలిన చైనా రాకెట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

China Rocket Burns Up : మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఆకాశంలో వెలుగులు విరజిమ్మాయి. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన చాలామంది ఇది ఉల్కాపాతం అని మొదట భావించారు.

Chinese Rocket Burns Up In Skies : శనివారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఆకాశంలో వెలుగులు విరజిమ్మాయి. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన చాలామంది ఇది ఉల్కాపాతం అని మొదట భావించారు. అయితే అది భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించిన చైనా రాకెట్ యొక్క అవశేషాలు.అని ఓ యూఎస్ శాస్త్రవేత్త తెలిపారు. చైనాకు చెందిన Chang Zheng 5B రాకెట్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తున్నపుడు పేలిపోవడంతో వెలువడిన కాంతి అది అని సైంటిస్ట్ తెలిపారు.

గతేడాది ఫిబ్రవరిలో చైనా..Chang Zheng సిరీస్ రాకెట్‌ ను ప్రయోగించగా... ఇది శనివారం భూమి వాతావరణంలోకి మళ్ళీ ప్రవేశించింది. భారతదేశ గగనతలంలో పేలిపోయింది. ఈ రాకెట్ శిథిలాల్లో అత్యధిక భాగం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నపుడే మండిపోయాయి. దీనివల్ల హాని జరిగే అవకాశం చాలా తక్కువ ఉంది. ఈ రాకెట్ బాడీ శనివారం క్రిందకు వస్తుందని ముందుగానే ఊహించామని అమెరికాకు చెందిన ఆస్ట్రోనామర్ జొనాథన్ మెక్‌డొవెల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వట్ చేశారు. ఈ రాకెట్ రీఎంట్రీ స్టేజ్‌గా తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. Chang Zheng రాకెట్ మూడో దశ అని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

First published:

Tags: China, India, Rocket

ఉత్తమ కథలు