రేపే ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ... ఇవీ ప్రత్యేకతలు

PM Modi and Xi Jinping Meeting : దేశాధి నేతల మధ్య ఇలాంటి అంతర్జాతీయ సమావేశం దక్షిణ భారత్‌లో జరగడం ఇదే తొలిసారి. మరి ఈ భేటీలో ఏం చర్చిస్తారు. దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 10, 2019, 2:08 PM IST
రేపే ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ... ఇవీ ప్రత్యేకతలు
మామల్లపురం (credit - twitter - Indian Diplomacy)
  • Share this:
PM Modi and Xi Jinping Meeting : భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య శుక్రవారం కీలకమైన భేటీ జరగనుంది. ఇలా భేటీ అవుదామని ప్రధాని నరేంద్ర మోదీ కోరడంతో జి జిన్ పింగ్ సరే అన్నారు. ఐతే... ఏ ఢిల్లీలోనే మీట్ అయితే ఏం బాగుంటుంది అనుకున్న మోదీ... ఇందుకోసం ఎవరూ ఊహించని విధంగా... తమిళనాడులోని... మామల్లపురం పట్టణాన్ని ఎంపిక చేశారు. అందువల్ల జి జిన్ పింగ్... 11, 12 ఇండియాలో ఉంటారు. చెన్నైని సందర్శిస్తారు. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది తేలాల్సిన ప్రశ్న. ఐతే... కేంద్ర ప్రభుత్వ వర్గాలు... పెద్దగా చర్చించేది ఏమీ ఉండదనీ, రెండు దేశాలకూ సంబంధించిన అంశాలు, వాణిజ్య విషయాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకుంటారనీ, ఐతే... ఏ ఒప్పందాలూ కుదుర్చుకునేది లేదని అంటున్నారు. సో... ఈ భేటీ వల్ల రెండు దేశాల మధ్యా సత్సంబంధాలు మరింత పెరుగుతాయని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోంది కాబట్టి... ఆ దేశానికి చైనా ఎక్కువగా మద్దతు ఇవ్వకుండా అడ్డుకునేందుకూ, చైనాను మనవైపు తిప్పుకునేందుకూ ఈ భేటీ ఉపయోగపడుతుందని అనుకోవచ్చు.


ఇదివరకు 2018 ఏప్రిల్ 27, 28లో ప్రధాని మోదీ చైనా వెళ్లి... వుహన్‌లో జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అప్పట్లోనే మనం మళ్లీ కలుద్దామని మోదీ అన్నట్లు తెలిసింది. ఆ క్రమంలో మరోసారి భేటీ జరగబోతోంది. వాణిజ్యపరంగా చూస్తే... పాకిస్థాన్‌తో పోల్చితే... చైనాకి భారత్ అత్యంత కీలకమైన దేశం. అసలు చైనాలో తయారవుతున్న వస్తువుల్లో చాలా వరకూ వాడేస్తున్నది ఇండియన్లే. కాబట్టి... చైనా మనతో సత్సంబంధాలు కొనసాగిస్తూ... లక్షల కోట్లు సంపాదిస్తోంది. 2018లో రెండు దేశాల మధ్యా బిజినెస్... 95.54 బిలియన్ డాలర్లకు చేరింది. చైనా నుంచీ భారత్ దిగుమతులు 12.7 శాతం పెరిగాయి. భారత్ నుంచీ చైనా దిగుమతులు 15.2 శాతం పెరిగాయి. అందువల్ల ఏమాత్రం అభివృద్ధి చెందని పాకిస్థాన్ కోసం... మనలాంటి దేశాన్ని దూరం చేసుకోవడానికి చైనా ఏమాత్రం ఆసక్తి చూపదని చెప్పుకోవచ్చు.

మామల్లపురం ప్రత్యేకతేంటి : ఆ పట్టణం పేరును బట్టే మనం అంచనాకి రావచ్చు... అదేదో రాజుల కాలం నాటి ఊరు అని. కరెక్టే. మహాబలిపురం... మహాబలిపురం అనే సాంగ్ వినే ఉంటారు. ఆ మహాబలిపురమే... ఈ మామల్లపురం. కట్టించింది పల్లవరాజులు. అప్పట్లో మహాబలిపురం ఓ రేంజ్‌లో ఉండేది. పల్లవరాజుకు కళలంటే వివరీతమైన ఇష్టం. అందుకే... మామల్లపురాన్ని ఓ అద్భుత ప్రపంచంలా తీర్చిదిద్దించాడు. అప్పటి శిల్పకళాకారులు చాలా కష్టపడి... అద్భుత మహాబలిపురాన్ని నిర్మించారు. అక్కడ 1200 ఏళ్ల నాటి ఆలయాలు చాలా ఉన్నాయి. ఈ పట్టణ విశిష్టత తెలుసుకున్న యునెస్కో... దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. పురాణాల్లో కూడా మహాబలిపురం ప్రస్తావన ఉంది. అందుకే... దీన్ని జిన్ పింగ్‌కి చూపించే ఉద్దేశంతో మోదీ... ఇక్కడ భేటీ ఏర్పాటు చేయించారు.

ఇక్కడి సముద్రం పక్కన ఉన్న ఆలయాన్ని జిన్ పింగ్ సందర్శిస్తారు. ఆలయం పక్కనే ఉన్న ఐదు రథాల్ని ఏకశిలతో చెక్కడం విశేషం. జిన్ పింగ్ రాక సందర్భంగా ఈ ఆలయాన్ని సరికొత్తగా ముస్తాబు చేశారు.

 

Pics : పరువాల పూదోట సోనీ చరిష్టా క్యూట్ ఫొటోస్...


ఇవి కూడా చదవండి :

Health Tips : టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు ఈ ఆహారం తినండి...

Health Tips : బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి...

Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...

Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే
First published: October 10, 2019, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading