సెక్సువల్ కంటెంట్‌తో పిల్లలను చెడగొడుతున్న టిక్ టాక్.. ఇతర దేశాల్లో మాత్రం..

హింసాత్మక, అడల్ట్ కంటెంట్‌ నుంచి పిల్లలను కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది. కానీ భారత్‌లో మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. చిన్న పిల్లలకు కూడా అడల్ట్ వీడియోలు వస్తున్నాయి.

news18-telugu
Updated: June 20, 2020, 2:09 PM IST
సెక్సువల్ కంటెంట్‌తో  పిల్లలను చెడగొడుతున్న టిక్ టాక్.. ఇతర దేశాల్లో మాత్రం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చైనీస్ యాప్ టిక్ టాక్‌పై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. హింసాత్మక, లైంగికపరమైన వీడియోలను ప్రోత్సహిస్తోందని.. దాన్ని ఇండియాలో నిషేధించాలని డిమాండ్లు వినిపించాయి. ఐతే తాజాగా టిక్ టాక్‌కు మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్లలు హింసాత్మక, అడల్ట్ కంటెంట్‌ను చూడకుండా ఉండేందుకు దాదాపు అన్నిదేశాల్లో ఎన్నో చర్యలు తీసుకుంది టిక్ టాక్. 14 ఏళ్ల లోపు పిల్లలు అలాంటి వీడియోలు చూడలేరు. కానీ భారత్‌లో అలాంటి జాగ్రత్తలు, చర్యలేవీ తీసుకోలేదు. అందరికి ఎలాంటి వీడియోలు వస్తాయో.. చిన్న పిల్లలకు అవే వీడియోలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనీస్ యాప్ టిక్ టాక్ పిల్లలను చెడగొడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కానీ అమెరికా, యూరప్ సహా ఇతర దేశాల్లో మాత్రం చిన్న పిల్లలకు సెక్సువల్ కటెంట్ యాక్సెస్ చేయకుండా చర్యలు చేపట్టింది. హింసాత్మక, అడల్ట్ కంటెంట్‌ నుంచి పిల్లలను కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది. కానీ భారత్‌లో మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. చిన్న పిల్లలకు కూడా అడల్ట్ వీడియోలు వస్తున్నాయి. భారత్‌లో దాదాపు 30 కోట్ల మంది టిక్ టాక్ యూజర్లు ఉన్నారు. ఇంత పెద్ద మార్కెట్ ఉన్న ఇండియా విషయంలో పిల్లలకు సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. దీనికి తోడు సరిహద్దుల్లో చైనా పేట్రేగిపోతుండడం..టిక్ టాక్ చైనీస్ యాప్ కావడంతో.. ఆ యాప్‌ను నిషేధించాలన్న డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి.

కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సైతం ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. భారత్‌లో చైనీస్ రెస్టారెంట్లను నిషేధించాలన్న ఆయన..తాజాగా ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. '' చైనీస్ వీడియో యాప్ టిక్ టాక్‌ను భారత్‌లో నిషేధించాలి. భారత్‌లో సుమారు 15 కోట్ల మంది టిక్ టాక్ వినియోగిస్తున్నారు. తద్వారా చైనాకు కోట్లల్లో ఆదాయం చేకూరుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేందుక భారత్‌లో టిక్ టాక్ యాప్ నిషేధించాలి. టిక్ టాక్ యాప్‌ను ఎవరూ వాడవద్దని అందరికీ విజ్ఞప్తి.'' అని రాందాస్ అథవాలే ట్వీట్ చేశారు.
First published: June 20, 2020, 1:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading