హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

India-China Border: పాంగాంగ్ సరస్సు నుంచి వెనక్కి వెళ్తున్న ఇరు దేశాల బలగాలు

India-China Border: పాంగాంగ్ సరస్సు నుంచి వెనక్కి వెళ్తున్న ఇరు దేశాల బలగాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India-China Border: గతేడాది మే లో గల్వాన్ లోయ వద్ద చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

  • News18
  • Last Updated :

సరిహద్దుల్లో చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఇరు దేశాల బలగాలను ఉపసంహరించుకున్నట్టు చైనా ప్రకటించింది. ఈ మేరకు తూర్పు లద్దాక్ లో ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద భారత్, చైనా బలగాలే వెనక్కి వెళ్లినట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా.. దీనిపై భారత్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. గతేడాది మే లో గల్వాన్ లోయ వద్ద చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి.


ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. తొమ్మిదో రౌండ్ చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు చైనా, భారత్ సాయుధ దళాలు వెనక్కి వెళ్లాయని చైనా రక్షణ శాఖ తెలిపింది.

First published:

Tags: China, Defence Ministry, India, India-China, Indo China Tension

ఉత్తమ కథలు