Home /News /national /

CHINAS ANOTHER CONSPIRACY WITH PAKISTAN IN THE INDIAN OCEAN INDIA GAVE A DIZZYING SHOCK UMG GH

హిందూ మహా సముద్రంలో పాక్ తో కలిసి చైనా మరో కుట్ర.. దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్.. చదివితే ఇండియాకి సెల్యూట్ చేస్తారు!

హిందూ మహా సముద్రంలో పాక్ తో కలిసి చైనా మరో కుట్ర..

హిందూ మహా సముద్రంలో పాక్ తో కలిసి చైనా మరో కుట్ర..

హిందూ మహాసముద్రం(Indian Ocean) ప్రాంతాల్లో చైనా (China)తమ ఆధిపత్యం చూపించడానికే పాక్ తో సంయుక్త ప్రదర్శన చేయడానికి పూనుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఇన్స్ విక్రాంత్ ను ప్రవేశ పెట్టి వాటి దూకుడుకు చెక్ పెట్టనుంది.

డ్రాగన్ (Dragon)దేశం మన దేశం మీద తరచూ బుసలుకొడుతూనే ఉంది. గాల్వాన్ లోయలో జరిగిన ఇరు దేశాల సైనికుల ఘర్షణలో చైనా చావు దెబ్బ తిన్నది. ఇక అప్పటి నుంచి మనదేశం మీద ఎదో ఒక విధంగా కుయుక్తులు పన్నుతూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. దీనికి తోడు చిరకాల శత్రువు దాయది పాకిస్తాన్(Pakistan) తో చేతులు కలిపి మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంలోనే గిల్గిత్ బాల్టిస్తాన్ లో చైనా-పాక్ ఏకానమిక్ కారిడార్ ను నిర్మించింది.

హిందూ మహాసముద్రంలో ప్రభావం పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందా?
హిందూ మహా సముద్రం మన దేశానికి చాలా కీలకం. సరుకుల రవాణాలో ఎగుమతులు, దిగుమతుల కోసం ఎక్కువగా ఈ సముద్రం మీదే ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే చైనా హిందూ మహాసముద్రంలో పట్టు కోసం పాకులాడుతోంది. చైనా ఇప్పటికే శ్రీలంక(Sri Lanka), పాక్ లో ఇప్పటికే కొన్నిపోర్టులు నిర్మించి వాటిని తమ హద్దుల్లో ఉంచుకొంది. ఈ ప్రయత్నంలోనే జూలై 10 న షాంఘై తీరంలో 'సీ గార్డియన్స్-2' అనే పేరుతో చైనా, పాకిస్థాన్‌ సంయుక్తంగా డ్రిల్స్ ప్రారంభించాయి. శత్రు దేశాల నుంచి తమ సముద్ర ప్రాంతాల్లో దాడులను ఎదుర్కొనేందుకు రెండు దేశాలకు చెందిన హైటెక్ నౌకాదళ నౌకలు, ఫైటర్ జెట్‌లు జులై 12 న ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. PLA నేవీ ప్రతినిధి కెప్టెన్ లియు వెన్షెంగ్ మాట్లాడుతూ "ఈ డ్రిల్‌లో సముద్ర లక్ష్యాలను ఉమ్మడిగా ఎదుర్కోవడంపై శిక్షణ ఇస్తామన్నారు. అంతేకాకుండా జాయింట్‌ ప్లానింగ్‌, జాయింట్‌ యాంటి మెరైన్‌ వార్‌ఫేర్, దెబ్బతిన్న నౌకలకు సపోర్ట్‌ చేయడం వంటి ట్రైనింగ్ కూడా ఇస్తామని" ఉద్ఘాటించారు.

డ్రిల్‌లో పాల్గొంటున్ననౌకలు, జలాంతర్గామి, జెట్ లు ఇవే!
మహాసముద్రంలో పరస్పరం ఇరు దేశాలు నిర్వహించిన ఈ డ్రిల్ తమ శతృదేశాలకు కోపం ఆగ్రహం తెప్పిస్తుందనడంలో సందేశం లేదు. చైనీస్ ఫ్రిగేట్ జియాంగ్టాన్, పాకిస్థానీ ఫ్రిగేట్ తైమూర్, చైనీస్ కొర్వెట్ షూజో, చైనీస్ సమగ్ర సరఫరా నౌక క్విన్‌డ్రోహు, ఒక చైనీస్ జలాంతర్గామి, ఎర్లీ వార్నింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, రెండు యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్ ప్రదర్శన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి తోడు పాక్ కు ఆర్థికంగా , ఆయుధాల పరంగా అన్నింటా చైనా దన్నుగా నిలుస్తోంది.

చైనా & పాకిస్థాన్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తున్నాయి?
హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో చైనా తమ ఆధిపత్యం చూపించడానికే పాక్ తో సంయుక్త ప్రదర్శన చేయడానికి పూనుకున్నాయి. కానీ చైనా వాదన మరోలా ఉంది. సముద్రపు దొంగలు, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తాము మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని వాదిస్తోంది. 2020 జనవరిలో కరాచీలోని ఉత్తర అరేబియా సముద్రంలో జరిగిన 'సీ గార్డియన్స్' డ్రిల్‌ మొదటి ప్రదర్శన చేసింది. ఎలాగైనా హిందూ మహాసముద్రంలో భారత్ ను దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తోంది.

ఇదీ దవండి: ఇది కదా బంపర్ ఆఫర్! ఇలా లాటరీ టికెట్ కొన్నారంటే మీకు కోట్లే.. ప్రైజ్ మనీ ఎంతంటే..?


అప్రమత్తమైన భారత్..
హిందూ మహాసముద్రంలో చైనా జలాంతర్గాముల ఉనికి పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. మొదటి నుంచి చైనా ఈ సముద్రంపై పెత్తనం చెలాయిస్తోందని చాలా సార్లు భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో భారత్‌ను ఎదుర్కోవడానికి పాక్ నేవీకి సహకారం అందిస్తూ ని బలోపేతం చేయిస్తోంది చైనా. అంతే కాకుండా హిందూ మహాసముద్రంలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా మొదటి సైనిక స్థావరం నిర్మాణం చేసింది.

INS విక్రాంత్‌ తో చైనా, పాకిస్తాన్ లకు చెక్ పెట్టనున్న భారత్..
భారతదేశపు మొట్టమొదటి విమాన వాహక నౌక విక్రాంత్ ను ఆగస్ట్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్దం అయ్యింది. ఈ వాహన నౌక శత్రు దేశాలకు సింహస్వప్నంగా మారుతుందని భారత్ ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇటీవలే విక్రాంత్ జులై 10న నాలుగో దశ సముద్ర ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. భారత నావికాదళం సముద్ర ట్రయల్స్ సమయంలో చాలా పరికరాలు, వ్యవస్థలను ఆన్‌బోర్డ్‌లో పరీక్షించినట్లు తెలిపింది . ఈ వాహన నౌక మీద MiG-29K యుద్ధవిమానాన్ని రన్ వే మీద ల్యాండ్ చేసింది.ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ విశేషాలు, ప్రత్యేకతలు ..
INS విక్రాంత్ ను అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. 262 మీ వెడల్పు , 62 మీ బీమ్, 59 మీ ఎత్తు, 37,500 టన్నులు డిస్‌ప్లేస్‌మెంట్‌, 14 డెక్‌లు, 28 నాట్ల గరిష్ట వేగంతో ముందుకు దూసుకెళ్లగలదు. ఇందులో 1,700 మంది సిబ్బందికి వసతి కల్పించేలా భారత నావికా దళం డిజైన్ చేసింది. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో తయారీ చేశారు. విమాన వాహక నౌకలను నిర్మించగల సామర్థ్యం ఉన్న యూఎస్, యూకే , రష్యా, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల సరసన భారత్‌ చేరింది. INS విక్రాంత్‌కు MiG-29K యుద్ధ విమానాలు, Kamov-31 హెలికాప్టర్లు, MH-60R మల్టీ-రోల్ హెలికాప్టర్లు, స్వదేశీ అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను నిర్వహించే సత్తా ఉంది. INS విక్రాంత్ విమాన వాహన నౌకను హిందూ మహా సముద్రంలో ప్రవేశ పెట్టి శత్రు దేశాలా గుండెల్లో దడ పుట్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: China, Corona, Indian Army, Srilanka

తదుపరి వార్తలు