China troops: 10,000 సైన్యం వెనక్కు... చైనాకి జ్ఞానోదయం అయ్యిందా?

China troops: 10,000 సైన్యం వెనక్కు... చైనాకి జ్ఞానోదయం అయ్యిందా? (credit - twitter)

China withdraws troops: యుద్ధం వద్దు... శాంతి ముద్దు అని భారత్ ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టిన చైనా... సడెన్‌గా 10,000 మంది సైన్యాన్ని ఎందుకు సరిహద్దుల వెనక్కి తీసుకుపోయింది?

 • Share this:
  China withdraws troops: అవునా... నిజమేనా అని ప్రశ్నించుకునే ఘటన ఇది. భారత్ పట్ల కుళ్లు, కుతంత్రాలతో రగిలిపోతున్న చైనా... ఉన్నట్టుండి... 10,000 మంది తమ సైన్యాన్ని లడక్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (LAC) నుంచి వెనక్కి తీసుకుంది. ఐతే... కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ డ్రాగన్ ఆర్మీ తిరుగుతూనే ఉంది. అందుకని ఇండియా వైపు నుంచి మన సైన్యం కూడా సరిహద్దు వెంట సన్నద్ధంతో ఉంది. చాల లొకేషన్లలో ప్రస్తుతం ఇలాంటి వాతావరణమే ఉంది. ఆర్మీ వెనక్కి వెళ్లిన తూర్పు లడక్ సరిహద్దు ప్రాంతాల్లో... సైన్యానికి ట్రైనింగ్ ఇస్తుంటారు. మొత్తం 150 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ ట్రైనింగ్ ఇస్తుంటారు. 2020 ఏప్రిల్-మే నుంచి డ్రాగన్ సైన్యం అక్కడ తిష్టవేసింది. సైన్యం వెళ్లిపోయినా... అప్పట్లో వారు తెచ్చిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు అక్కడే ఉన్నాయి.

  అసలు కారణం అదేనా?
  ఈ విషయం తెలిసిన మనలాంటి వాళ్లమంతా... వామ్మో చైనాలో ఎంత మంచి మార్పు వచ్చింది... ఏందుకో అనుకుంటూ ఉంటాం. నిన్న మన భారత సైన్యం... ఇండియా సరిహద్దుల్లోకి వచ్చిన చైనా సైనికుడిని... చైనాకి తిరిగి ప్రశాంతంగా అప్పగించింది. దాంతో చైనాలో మార్పు వచ్చేసి... తన సైన్యాన్ని వెనక్కి తీసుకుందేమో అనుకుంటున్నారు చాలా మంది. అసలు విషయం అది కాదట. చైనాలో మన కంటే ఎక్కువ చలి ఉంటుంది. ఎండ చాలా తక్కువ. అందువల్ల లడక్ సరిహద్దుల్లో అటువైపు చలి బాగా పెరిగిపోయిందట. ఇక అక్కడ ఉండటం సైనికుల వల్ల కావట్లేదట. దాంతో... "సరే వెనక్కి వచ్చేయండి... అక్కడ ఉండి మాత్రం చేసేదేముంది" అని పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే మనం డ్రాగన్‌ను నమ్మలేం అంటున్నారు విశ్లేషకులు.

  చైనాలో మంచి మార్పు రాలేదా?
  ఎన్ని కుయుక్తులు పన్నినా... చైనాలో ఈ మధ్య ఇండియా పట్ల కొంత మంచి మార్పు వచ్చిందన్నది నిజం. ఎందుకంటే... ఇంతకు ముందు ఇండియాలో తయారయ్యే కరోనా వ్యాక్సిన్లకు అంత సీన్ ఉండదు అన్న డ్రాగన్... తాజాగా మాట మార్చుకుంది. ఇండియాలో కూడా కరోనాను ఎదిరించగల వ్యాక్సిన్లు తయారవ్వగలవు అని ప్రకటించింది. తద్వారా... ఇండియాకి దగ్గరయ్యేందుకు యత్నిస్తోంది.

  ఇది కూడా చదివేయండి: Methi Health Benefits: మలబద్ధకం వేధిస్తోందా... మెంతులతో చిటికెలో పరిష్కారం

  ఎందుకీ మార్పు?
  చైనాలో ఈ మార్పుకి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అని తెలుస్తోంది. ఆయన ప్రతి నెలా మన్ కీ బాత్ పెట్టి... వోకల్ ఫర్ లోకల్ అని పదే పదే చెబుతుంటే... భారతీయులు కూడా లోకల్‌గా తయారవుతున్న వస్తువులనే వాడుతున్నారు. దాంతో చైనాకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీపావళికి అడ్డంగా లాస్ అయ్యాయి చైనా కంపెనీలు. చైనా యాప్‌లను నిషేధించడంతో ఆ కంపెనీల పరిస్థితి అయోమయం అయిపోయింది. ఇలా ఇండియాతో పెట్టుకుంటే... తమకే నష్టమని గ్రహించిన చైనా వంగి దండాలు పెట్టడం మొదలుపెట్టింది. అలాగని దుర్భుద్ది బీజింగ్‌ను నమ్మలేం. ఎందుకంటే... ఓవైపు ఇలా నటిస్తూనే... మరోవైపు రుణ యాప్‌లు, రంగుల బెట్టింగ్ యాప్‌లను ఇండియాలో ప్రవేశ పెట్టి వేల కోట్లు నొక్కేస్తూ... ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతోంది డ్రాగన్. అందుకే చైనాతో జాగ్రత్తగా ఉండాల్సిందే.
  Published by:Krishna Kumar N
  First published: