China Mobile Towers In Ladkh : సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్కలో బల్లెంలా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్న చైనా...వాస్తవాధీన రేఖ (LAC)వెంట అక్రమ నిర్మాణాలకు చేపడుతోంది. చైనా నుంచి ప్రపంచానికి విస్తరించినట్లుగా భావిస్తున్న కరోనా కారణంగా..అన్ని దేశాలతో పాటు భారత్ లో కూడా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో పాంగాంగ్ సరస్సుపై చైనా(CHINA) చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తవగా...తాజాగా ఎల్ఏసీ వెంట హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో మూడు మొబైల్ టవర్లను(CHINA MOBILE TOWERS) చైనా నిర్మించింది. ఈ విషయాన్ని చుషూల్ కౌన్సిలర్ కొంచెక్ స్టాంజిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొంచెక్ స్టాంజిన్ త ట్వీట్ లో..."చైనా దళాలు పాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మాణం పూర్తి చేశాయి. ఆ తర్వాత హాట్‌స్ప్రింగ్స్ వద్ద మూడు మొబైల్ టవర్లను నిర్మించాయి. ఇవి భారత్ భూభాగానికి చాలా సమీపంలో ఉన్నాయి. ఇది ఆందోళనకరం కాదా? ఇక్కడ మాకు కనీసం 4జీ సౌకర్యాలు కూడా లేవు. నా పరిధిలోని 11 గ్రామాలకు ఇప్పటికీ 4జీ సౌకర్యం లేదు" అని తెలిపారు. సరిహద్దు వెంట చైనా శరవేగంగా చేపడుతున్న నిర్మాణాలపై ఆందోళన వ్యక్తం చేసిన కొంచెక్ స్టాంజిన్, దీనిపై భారత ప్రభుత్వం స్పందించాలని కోరారు.
After completing the bridge over Pangong lake, China has installed 3 mobile towers near China's hot spring very close to the Indian territory. Isn't it a concern? We don't even have 4G facilities in human habitation villages. 11 villages in my constituency have no 4G facilities. pic.twitter.com/4AhP4TYVNY
— Konchok Stanzin (@kstanzinladakh) April 16, 2022
మరోవైపు, సరిహద్దు వెంట చైనా చేపట్టిన నిర్మాణాలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఫిబ్రవరిలో లోక్ సభలో మాట్లాడుతూ.. తూర్పు లడఖ్(LADAKH) సమీపంలోని చైనా ఆక్రమణలను ఏ మాత్రం అంగీకరించమన్నారు. పాంగాంగ్ వద్ద వంతెన నిర్మిస్తున్న ప్రాంతం 1962 నుంచి చైనా ఆక్రమణలో ఉందని తెలిపారు. ఇక,రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ..భారత్ కు హాని తలపెట్టే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని చైనాను ఉద్దేశించి గట్టి హెచ్చరికలు చేశారు. వారు ఏం చేశారో .. మేము ఏం నిర్ణయాలు తీసుకొన్నామో చెప్పను.. కానీ, భారత్ ఎటువంటి నష్టాన్ని సహించదన్న సందేశం చైనాకు చేరింది అని రాజ్ నాథ్ అన్నారు.
ALSO READ OMG : కేజీఎఫ్-2 సినిమా చూస్తుండగా..కాలు తగిలిందని తుపాకీతో కాల్చేశాడు
కాగా,ప్రపంచమంతా చైనా నుంచి వచ్చిన కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో 2020 మే నెలలో సరిహద్దులో భారత్ లో ఘర్షణకు దిగింది డ్రాగన్ దేశం. భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్ ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యాయి. గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనాలు సైనిక కమాండర్ల స్థాయిలో 15 సార్లు చర్చలు జరిపాయి. కానీ, ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సమస్య పరిష్యారం కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.