• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CHINA GUARD SACKED AFTER LEAKING X RAY SCAN OF SEX TOYS INSIDE WOMAN PASSENGER BAG GH SA

Sex Toys Bag: సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం ఊడగొట్టిన పోస్ట్... ఇంతకీ ఆయనేం చేశాడంటే..

Sex Toys Bag: సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం ఊడగొట్టిన  పోస్ట్... ఇంతకీ ఆయనేం  చేశాడంటే..

Sex Toys

చైనాలోని గువాన్‌జో ఫోషన్‌ మెట్రోస్టేషన్‌లో ఈ నెల 7న జరిగిన ఒక ఘటన వైరల్‌గా మారుతోంది. అప్పుడే సబ్‌వేలోకి వచ్చిన ఓ మహిళ.. సామాన్ల చె?

  • Share this:
ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు దగ్గర మన లగేజీని చెక్‌ చేస్తుంటారు. ఓ రోలింగ్‌ ట్రాలీ మీద లగేజీ పెడితే... అది ఓ మెషీన్‌ నుంచి బయటకు వస్తుంది. ఈ క్రమంలో అందులో ఉన్న వస్తువలను అక్కడి స్కానర్‌ గుర్తిస్తుంది. అలా తెలిసిన విషయం ఓ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని ఊడగొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గువాన్‌జో ఫోషన్‌ మెట్రోస్టేషన్‌లో ఈ నెల 7న జరిగిన ఒక ఘటన వైరల్‌గా మారుతోంది. అప్పుడే సబ్‌వేలోకి వచ్చిన ఓ మహిళ.. సామాన్ల చెకింగ్‌ కోసం తన లగేజీని ఎక్స్‌రే స్కానర్‌లోకి పంపించింది. అందులో ఏదో మెటల్‌ వస్తువులు ఉన్నట్లు సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. దీంతో బ్యాగు ఓపెన్‌ చేసి చెక్‌ చేశాడు. అందులో అనూహ్యంగా సెక్స్‌ టాయ్స్‌ కనిపించాయి. దీంతో చటుక్కున్న ఆ ఎక్స్‌రే ఇమేజ్‌ను మొబైల్‌లో కొన్ని ఫొటోలు తీసి పెట్టుకున్నాడు. అక్కడితో ఊరుకోకుండా... ఆ ఫొటోలను వీబో (చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం) గ్రూపులో షేర్‌ చేశాడు. అంతేకాక, చూడటానికి ఆమె లిన్‌ చి-లింగ్‌లా కనిపిస్తోందని, కానీ బ్యాగులో చూస్తే సెక్స్‌ టాయ్స్‌ ఉన్నాయని పోస్టుకు ట్యాగ్ రాసుకొచ్చాడు. దాంతో ఆ గ్రూపులో కాసేపు చర్చ జరిగింది.

ఆ చర్చ, అతడు పెట్టిన ఫొటోలను ఓ వ్యక్తి పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు అతడు పని చేస్తున్న మెట్రో స్టేషన్‌ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ విషయం సోషల్‌ మీడియాకి ఎక్కింది. దీంతో పలువురు నెటిజన్లు సెక్యూరిటీ గార్డు ప్రవర్తనను విమర్శించడం మొదలుపెట్టారు. మహిళల ప్రైవసీని ఆ సెక్యూరిటీ గార్డు తుంగలో తొక్కాడంటూ విరుచుకుపడ్డారు. అసలు లగేజీని ఫొటోలు తీసే అధికారం అతనికి ఎవరు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంకొంతమంది దేశంలో సెక్స్‌ టాయ్స్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారు కూడా.

ఈ చర్చ అంతా నడుస్తున్న సమయంలోనే ఆ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఊడిపోయింది. అయితే చేసిన తప్పును క్షమించాలంటూ సెక్యూరిటీ గార్డు కోరాడు. దాంతోపాటు ఆ ఫొటోలు తాను గ్రూపులో షేర్‌ చేయలేదని, తన స్నేహితుడికి పంపిస్తే అతను ఆ గ్రూపులో పెట్టాడని చెప్పుకొచ్చాడు. అయితే నెటిజన్ల ఆగ్రహం మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సెక్యూరిటీ చెక్‌లు ప్రొఫెషనల్స్‌తో చేయించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. గువాన్‌జో మెట్రో స్టేషన్‌ అధికారులు తీసుకున్న చర్యలపై కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇంకాస్త కఠినంగా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చైనాలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. రెండేళ్ల క్రితం ఓ సెక్యూరిటీ గార్డు... మహిళ గోతిక్‌ మేకప్‌ను తొలగించమని ఫోర్స్‌ చేశాడు. ఇంకో సందర్భంలో మహిళను అసభ్యంగా ఫొటోలు తీయడానికి మరో సెక్యూరిటీ గార్డు ప్రయత్నించాడు. దీంతో అప్పుడు కూడా ఇలానే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారట. అయినప్పటికీ ఇలా జరుగుతుండటం ప్రజల ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.
First published:

అగ్ర కథనాలు