హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మదర్సాలలో పాఠాలే వీటంతటికి కారణం..ఉదయ్ పూర్ హత్య ఘటనపై కేరళ గవర్నర్

మదర్సాలలో పాఠాలే వీటంతటికి కారణం..ఉదయ్ పూర్ హత్య ఘటనపై కేరళ గవర్నర్

ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (File)

ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (File)

Kerala Governor On Rajastan Brutal Murder : గత కొన్ని రోజులుగా బహిషృత బీజేపీ నేత నుపుర్ శర్మ (Nupur Sharma)వ్యాఖ్యలపై జరుగుతున్న ఘటనలు అందరికీ తెలిసిందే. ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా మొహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఇంకా చదవండి ...

Kerala Governor On Rajastan Brutal Murder : గత కొన్ని రోజులుగా బహిషృత బీజేపీ నేత నుపుర్ శర్మ (Nupur Sharma)వ్యాఖ్యలపై జరుగుతున్న ఘటనలు అందరికీ తెలిసిందే. ముస్లిం మనోభావాలను దెబ్బతినేలా మొహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోని పలు దేశాలు కూడా నుపుర్ శర్మ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అయితే ఇప్పుడు ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని కన్హయ్య లాల్ అనే ఓ టైలర్(Tailor)ని ఇద్దరు ముస్లిం యువకులు దారుణంగా కత్తులతో నరికి చంపారు(Brutally Murder).దుస్తుల కొలతలు ఇస్తున్నట్టుగా నమ్మించి తల నరికి హత్య చేశారు. ఈ ఘటనను వారు వీడియో తీసి షేర్ చేశారు. రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని ఉదయ్ పూర్‌(Udaipur)లో మంగళవారం జరిగిన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ హత్య ఉదంతంపై ఇవాళ(జూన్ 29)స్పందించిన కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్ ​ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదర్సాలలో నేర్పే పాఠాలే ముస్లిం పిల్లలను నేర ప్రవృత్తిలోకి నెట్టివేస్తున్నాయని, అందులో భాగంగానే ఉదయ్​పూర్​ వంటి దారుణాలు జరుగుతున్నాయని గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్ ​ఖాన్ అన్నారు. మదర్సాలలో దైవదూషణ చేసిన వారికి శిక్షగా శిరచ్ఛేదం చేయాలని పిల్లలకు బోధిస్తున్నారని, అందువల్లే ఇట్లాంటి దారుణాలు చూడాల్సి వస్తోందన్నారు.

రిఫ్ ఖాన్ మాట్లాడుతూ..."మనం కేవలం లక్షణాలను చూసి మాత్రమే బాధపడుతున్నాం. కానీ లోతైన రోగాన్ని గుర్తించలేకపోతున్నాం. దైవదూషణకు శిక్ష తల నరికేయడమేనని మదర్సాలలో చిన్నారులకు భోదిస్తున్నారు.మదర్సాలలో వారికి ఇది దేవుని చట్టంగా బోధిస్తున్నారు. ఇలాంటి లక్షణాలతోనే నేటి తరం యువత మదర్సాల నుంచి బయటికి వస్తోంది. దీనికి చింతిస్తున్నాను. ఇట్లాంటి ఘటనలు జరగకుండా మదర్సాలలో నేర్పే పాఠాలపై రివ్యూ చేయాల్సి అవసరం ఉంది. పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. కాగా, ఉదయ్ పూర్ లో టైలర్ హత్యకు పాల్పడిన వారిలో ఇద్దరిని రియాజ్ అఖ్తారీ, గౌస్ మహ్మద్‌ ను మంగళవారం రాత్రి రాజ్‌సమంద్ జిల్లాలోని భీమ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు.

Udaipur : ఒంటిపై 26 కత్తిపోట్లు.. కరాచీ ఉగ్ర సంస్థతో లింక్.. దాడి ఇస్లాంకు వ్యతిరేకమన్న ఇమామ్‌లు

కాగా హత్య గురి కావడానికి ముందు. తన ప్రాణాలకు ముప్పు ఉందని కన్హయ్య జూన్ 15న పోలీసులకు ఫిర్యాదు చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసులు ఇరు వర్గాలను కాంప్రమైజ్ చేసి పంపించారని... ప్రాణ భయంతో ఆరు రోజులపాటు షాప్ తెరవని కన్హయ్య... మంగళవారం దుకాణం తెరిచాడని.. అదే రోజు హత్యకు గురయ్యాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు అప్పుడే యాక్షన్ తీసుకొని ఉండుంటే అతడు బతికి ఉండేవాడని తెలిపారు.

First published:

Tags: Brutally murder, Kerala, Muslim brothers, Rajastan

ఉత్తమ కథలు