ఆకలి ఎంత పనిచేసింది.. ఆ చిన్నారులు అలా కడుపు నింపుకున్నారు

ఆకలిని తట్టుకోలేక నలుగురు చిన్నారులు మట్టి తిని కడుపు నింపుకున్నారు.ఎక్కడో కేరళలోని మారుమూల గ్రామంలో ఈ ఘటన జరగలేదు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని సెక్రటేరియట్‌కి కొద్ది దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

news18-telugu
Updated: December 4, 2019, 2:12 PM IST
ఆకలి ఎంత పనిచేసింది.. ఆ చిన్నారులు అలా కడుపు నింపుకున్నారు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
'ఆకలి ఊదే నాదస్వరానికి ఆడేవాడే మనిషి..' ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ చెప్పే డైలాగ్ ఇది.1981లో ఆ సినిమా విడుదలైంది. మూడు దశాబ్దాలు గడిచిపోతున్నా దేశంలో ఇప్పటికీ అదే పరిస్థితి. ప్రగతి వెలుగు జిలుగులు ఓవైపు.. పట్టెడన్నం దొరక్క పేదలు ఆకలితో అలమటిస్తున్న ధీన స్థితి మరోవైపు. తాజాగా కేరళలో చోటు చేసుకున్న ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆకలిని తట్టుకోలేక నలుగురు చిన్నారులు మట్టి తిని కడుపు నింపుకున్నారు.ఎక్కడో కేరళలోని మారుమూల గ్రామంలో ఈ ఘటన జరగలేదు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని సెక్రటేరియట్‌కి కొద్ది దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని ఉప్పిలమూడ్ రైల్వే బ్రిడ్జి సమీపంలో శ్రీదేవి అనే మహిళ తన ఆరుగురు బిడ్డలతో కలిసి నివాసం ఉంటోంది.ఆరుగురు పిల్లల్లో పెద్దవాడి వయసు 7 సంవత్సరాలు కాగా, మిగతా వాళ్లలో 3 నెలల పసికందు ఒకరు, రెండేళ్ల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. కొబ్బరి చెట్లు ఎక్కి బోండాలు తెంచే భర్త మద్యానికి బానిసై నిత్యం తాగొచ్చి చావబాదుతున్నాడు.దీంతో అతని పైనే ఆధారపడుతున్న కుటుంబం కొద్ది రోజులుగా ఆకలితో అలమటిస్తోంది. ఎంతలా అంటే.. తిండి లేక శ్రీదేవికి పాలు రాకపోవడంతో చంటిపిల్లలు కూడా అర్ధాకలితో అలమటిస్తున్నారు. అక్కడి స్థానికుల్లో ఒకరు వీరి పరిస్థితిపై శనివారం ఓ స్వచ్చంద సంస్థకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

ఆ స్వచ్చంద సంస్థ వారి ఇంటికి వెళ్లేసరికి ఆకలితో ధీనంగా ఉన్న చిన్నారులు కనిపించారు. తమను ఆదుకోవాలంటూ ఆ తల్లి వారికి చేతులెత్తి దణ్ణం పెట్టింది.జిల్లా శిశు సంరక్షణ అధికారుల సహాయం తీసుకుని ఆ నలుగురు చిన్నారులను స్థానిక శిశు సంరక్షణ యూనిట్‌కి తరలించారు. మిగతా ఇద్దరు పసిబిడ్డలు కావడం.. వారికి తల్లి పాలు అవసరం కాబట్టి ఆమె వద్దే వదిలిపెట్టారు.ఆ కుటుంబానికి ఆదుకుంటామని స్థానిక కౌన్సిలర్ కోమవల్లి తెలిపారు. నిజానికి చాలాసార్లు తాను వారి ఇంటికి వెళ్లానని.. కానీ వారి పరిస్థితి గురించి ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కేరళలో వెలుగుచూసిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading