హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Travel for free : ఎక్కడైనా ప్రయాణించవచ్చు.. ఇకపై ఐదేళ్లలోపు చిన్నారులకు నో బస్ టిక్కెట్

Travel for free : ఎక్కడైనా ప్రయాణించవచ్చు.. ఇకపై ఐదేళ్లలోపు చిన్నారులకు నో బస్ టిక్కెట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Travel for free in buses: తమిళనాడు(Tamilnadu)లోని ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక నుంచి ఐదేళ్లలోపు పిల్లలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇంకా చదవండి ...

Below 5 years to travel for free in buses: తమిళనాడు(Tamilnadu)లోని ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక నుంచి ఐదేళ్లలోపు పిల్లలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం తమిళనాడు అసెంబ్లీలో వాణాశాఖ ప‌ద్దు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా మంత్రి శివ‌శంక‌ర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఐదేళ్లలోపు పిల్లలు బస్ ఛార్జీ లేకుండానే రాష్ట్రంలో ఎ్కడైనా ప్రయాణించవచ్చని మంత్రి తెలిపారు . గతంలో ఇచ్చిన హామీల ప్రకారం విద్యార్థులకు,మహిళలు రవాణాలో రాయితీలు ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. విద్యార్ధులకు ఫ్రీ బస్ పాన్ ఇస్తున్నామని, మహిళలకు చెన్నై సహా పలు పట్టణాల్లో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

ఇక,రాయితీతో కూడిన సీజన్‌ టిక్కెట్లు ఇకపై ఆన్‌ లైన్‌ ద్వారా పొందవచ్చని మంత్రి వెల్లడించారు. చెన్నై, తిరుచ్చి, విల్లుపురం రవాణా మండలాల్లోని బస్‌ డిపోల స్థాయి పెంచి ఆధునికీకరణ చేయనున్నట్లు శివశంకర్ తెలిపారు. ఈ డిపోల్లో బస్సులు శుభ్రం చేసేందుకు ఆటోమేటిక్‌ విధానాన్ని అమలుచేస్తామని మంత్రి చెప్పారు. ఈ సౌకర్యం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ డిపోల్లో ప్రభుత్వ శాఖల వాహనాలకు మరమ్మతు నిర్వహించేలా ఆధునిక మొబైల్‌ డిపోలను రూపొందించనున్నట్లు శివశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థలన్నింటినీ సమైక్యపరచి ప్రయాణికుల సౌకర్యార్ధం సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నామని మంత్రి తెలిపారు.

ALSO READ Snooze at work : ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్..మధ్య్నాహం ఓ అరగంట హాయిగా నిద్రపోవచ్చు

కాగా,ఇప్పటికే స్టాలిన్ సర్కార్..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిణులకు వారి ఉన్నత విద్యను అభ్యసించేందుకు నెలకు రూ.1000 ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఉన్న‌త విద్యను ప్రోత్సహించడానికి, వారికి సహాయం చేయడానికి నెలవారీగా డ‌బ్బు డిపాజిట్ చేయనుంది. ఈ ప‌థ‌కం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన బాలికల బ్యాంకు ఖాతాల్లో రూ.1000 జమ చేస్తారు. ఈ పథకం ద్వారా సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఈ పథకం కోసం మొత్తం రూ.698 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యలో ప్రభుత్వ పాఠశాలల ప్ర‌వేశాన్ని పెంచ‌డానికి ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 12 తరగతుల బాలికలందరికీ వారి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, ITI కోర్సులు నిరంతరాయంగా పూర్తయ్యే వరకు వారి బ్యాంకు ఖాతాలలో నెల‌కు వెయ్యి రూపాయిలు జ‌మ అవుతాయి. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న స్కాల‌ర్ షిప్ ల‌తో పాటు ఈ ప‌థ‌కం ద్వారా కూడా విద్యార్థులు ల‌బ్దిపొందుతారు అని మంత్రి తెలిపారు.

First published:

Tags: Bus services, Children, Tamilnadu

ఉత్తమ కథలు