సర్కార్ స్కూల్లో ఇంత నిర్లక్ష్యమా.. మధ్యాహ్న భోజనానికి ఏమిచ్చారో తెలుసా..

దేశంలోని కొన్నిచోట్ల మధ్యాహ్న భోజన పథకం సవ్యంగా సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు పోషకాహారం అందడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఉన్న సియూర్ ప్రైమరీ స్కూల్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

news18-telugu
Updated: August 23, 2019, 1:10 PM IST
సర్కార్ స్కూల్లో ఇంత నిర్లక్ష్యమా.. మధ్యాహ్న భోజనానికి ఏమిచ్చారో తెలుసా..
మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నమక్ రోటీ(చపాతీ,ఉప్పు) వడ్డిస్తున్న దృశ్యం
  • Share this:
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేద,మధ్యతరగతి వర్గాలకు చెందినవారే. పూట గడవడం కూడా కష్టంగా ఉండే పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు పిల్లలను స్కూళ్లకు కాకుండా.. కూలీ పనులకు పంపిస్తుంటారు. అలాంటి చర్యలకు చెక్ పెట్టి.. పిల్లలను బడి బాట పట్టించేందుకు కేంద్రప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకొచ్చింది. అయితే దేశంలోని కొన్నిచోట్ల ఈ పథకం సవ్యంగా సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు పోషకాహారం అందడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఉన్న సియూర్ ప్రైమరీ స్కూల్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

స్కూల్లో మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు చపాతీలతో పాటు కర్రీ ఇవ్వకుండా.. ఉప్పు ఇచ్చారు. దీంతో పిల్లలు చపాతీలను ఉప్పుతోనే తినేశారు. ఇదే స్కూల్లో కొన్ని సందర్భాల్లో అన్నంతో పాటు కర్రీ ఇవ్వకుండా.. ఉప్పు ఇస్తున్నారని అక్కడి పిల్లలు చెబుతున్నారు.చేసేదేమీ లేక అన్నంలో ఉప్పు కలుపుకుని తినేస్తున్నామని అన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో చిన్నారులకు ఇవ్వాల్సిన పాలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఈ విషయం వెలుగుచూడటంతో స్థానిక అధికారులు స్కూల్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేశారు.

స్కూల్లో పనిచేసే ఆయాను దీనిపై ఆరా తీయగా.. పిల్లలందరికీ సరిపోయేలా వండేందుకు అవసరమైన కూరగాయలు,దినుసులు ఇవ్వడం లేదని తెలిపింది. అరకిలో ఆలుగడ్డలు ఇచ్చి పిల్లలందరికీ వండాలని చెబుతున్నారని.. చేసేదేమి లేక అలాగే వండుతున్నానని చెప్పింది. మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజనం కోసం స్కూల్‌కు వస్తున్న వంట సామానును మాయం చేస్తున్న టీచర్లపై మండిపడింది. స్కూల్లో అక్రమాలకు తావు లేకుండా చూసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించింది.


First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు