వాళ్లు చిన్నపిల్లలు.. వెయిట్ లిఫ్టర్లు కాదు..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:15 PM IST
వాళ్లు చిన్నపిల్లలు.. వెయిట్ లిఫ్టర్లు కాదు..!
  • News18
  • Last Updated: June 6, 2018, 3:15 PM IST
  • Share this:
వర్షాకాలం ప్రారంభమవుతోంది. మరికొద్ది రోజుల్లో స్కూల్స్ ప్రారంభమవుతాయి. ఇప్పటకి  పిల్లల కోసం షాపింగ్ లో మునిగిపోయారు తల్లిదండ్రులు. స్కూల్ బ్యాగ్స్, బుక్స్ కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. స్కూల్స్  ప్రారంభమయితే ఎక్కడ చూసినా వీపుకు స్కూల్ బ్యాగ్స్ తగిలించుకున్న పిల్లలే కనిపిస్తారు. అయితే స్కూల్ బ్యాగ్స్ కు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

చిన్నారుల పట్ల విద్యాసంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యార్థులు వెయిట్ లిఫ్టర్లు, స్కూల్ బ్యాగులు లోడ్ కంటెయినర్లు కాదని బుధ‌వారం స్పష్టం చేసింది. చిన్నపిల్లలు తీసుకెళ్తున్న బ్యాగ్‌ల బరువు తగ్గించాలని, ఒకటో తరగతి, రెండో తరగతి విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని కోరింది. విద్యార్థుల బరువులో వారు తీసుకెళ్తున్న బ్యాగ్ బరువు 10శాతం మాత్రమే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

తాము వెలువరించిన తీర్పును పాఠశాల విద్యాసంస్థలు పాటించేలా సీబీఎస్‌ఈ ఫ్లెయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని, నో-హోంవర్క్ రూల్‌ను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇదే విషయంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌సీఈఆర్‌టీతో పాటు కేంద్రప్రభుత్వానికి సూచించింది. అనుమతి లేని పుస్తకాలు నిషేధించేలా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు వెల్లడించింది. మరి ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను స్కూల్ యాజమాన్యాలు అమలు చేస్తాయో లేదో చూడాలి.
First published: May 30, 2018, 10:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading