హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Child Marriage: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. మైనర్ గా కూడా పెళ్లి చేసుకోవచ్చు.. కానీ..

Child Marriage: హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. మైనర్ గా కూడా పెళ్లి చేసుకోవచ్చు.. కానీ..

8. ఇద్ద‌రి వాద‌న‌లు విన్న త‌రువాత కోర్టు యూనివ‌ర్సిటీదే త‌ప్పు అని భావించి అధ్యాప‌కురాలికి లక్ష పౌం డ్లు (దాదాపు రూ.కోటి) చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8. ఇద్ద‌రి వాద‌న‌లు విన్న త‌రువాత కోర్టు యూనివ‌ర్సిటీదే త‌ప్పు అని భావించి అధ్యాప‌కురాలికి లక్ష పౌం డ్లు (దాదాపు రూ.కోటి) చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

మైనర్‌ (Minor)గా ఉన్నప్పుడు చేసిన పెళ్లి(Marriage)ని వ్యక్తి అంగీకరిస్తే.. మేజర్ (Major) అయిన తరువాత ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది పంజాబ్(Punjab), హర్యానా(Haryana) హైకోర్టు(Highcourt). మేజర్ అయిన తరువాత సదరు వ్యక్తి చట్ట ప్రకారం విడాకులు తీసుకోవచ్చని సైతం హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...

మైనర్‌ (Minor)గా ఉన్నప్పుడు చేసిన పెళ్లి(Marriage)ని వ్యక్తి అంగీకరిస్తే.. మేజర్ (Major) అయిన తరువాత ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది పంజాబ్(Punjab), హర్యానా(Haryana) హైకోర్టు(Highcourt). మేజర్ అయిన తరువాత సదరు వ్యక్తి చట్ట ప్రకారం విడాకులు తీసుకోవచ్చని సైతం హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక కేసు విచారణ సందర్భంగా ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. 2009 ఫిబ్రవరి 27న వివాహం చేసుకున్న దంపతులు తమకు విడాకులు జారీచేయాలంటూ లూథియానాలోని ఫ్యామిలీ కోర్టును గతేడాది జూన్ 22న ఆశ్రయించారు. కానీ వీరికి విడాకులు మంజూరు చేసేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. పెళ్లి చేసుకున్న సమయంలో భార్య మైనర్ కాబట్టి వారి వివాహం చెల్లదని.. అందువల్ల విడాకులు ఇవ్వటం కూడా కుదరదని ఫ్యామిలీ కోర్టు తేల్చింది. కానీ 18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్న మైనర్‌ బాలిక.. మేజర్ అయిన తర్వాత భర్త అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే మైనర్ తమ వివాహం చెల్లదని ప్రకటించకపోతేనే భర్త నుంచి చట్టబద్దంగా విడాకులు తీసుకోవచ్చని హైకోర్టు తీర్పు వెలువరించింది.

Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు వినూత్న ఆహ్వానం.. వైరల్ అవుతున్న వీడియో..


లూథియానాకు చెందిన ఈ దంపతులు 2009లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో భర్త వయసు 23 ఏళ్లు కాగా.. భార్య వయసు 17 సంవత్సరాల 6 నెలల 8 రోజులు. వీరికి 2010 జనవరి 31న ఒక బిడ్డ కూడా జన్మించింది. కానీ గతేడాది ఈ జంట తమ వివాహాన్ని రద్దు చేయాలని లూథియానా ఫ్యామిలీ కోర్టు కెక్కింది. అయితే హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 5 (iii) ప్రకారం వధువు 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంటేనే ఆమె వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. వివాహ సమయంలో ఆ మహిళ మైనర్ కావడంతో.. పరస్పర అంగీకారంతో విడాకులు ఇవ్వడానికి కుటుంబ కోర్టు నిరాకరిస్తూ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోలేదు.

ఈ క్రమంలోనే పంజాబ్, హర్యానా డివిజన్ ధర్మాసనం లూథియానా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. దంపతుల వివాహం చెల్లదని చెబుతూనే.. హిందూ వివాహ చట్టం, 1955 సెక్షన్ 13-బి ప్రకారం విడాకుల పిటిషన్‌ను అనుమతించి ఉండాల్సిన అవసరం ఉందని తీర్పు ఇచ్చింది. దంపతుల విడాకులపై జస్టిస్ రీతూ బహ్రీ, జస్టిస్ అరుణ్ మోంగాలతో ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్య తమ వివాహం చెల్లదని ప్రకటించడానికి ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు.. కాబట్టి హిందూ వివాహ చట్టం, 1955 సెక్షన్ 13-బి ప్రకారం భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Minor Girl: ఆన్‌లైన్‌ క్లాసులు పక్కనపెట్టి.. నగ్న వీడియోలను వెబ్ సైట్ లో పోస్టు చేసిన బాలిక.. చివరకు..


ఇరుపక్షాల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. పరస్పర అంగీకారం ద్వారా దంపతులకు విడాకులు మంజూరు చేసింది. హిందూ వివాహ చట్టం,1955లో సెక్షన్ 13 (2) (iv).. మద్రాస్ హైకోర్టు తీర్పు ఆధారంగా లూథియానా ఫ్యామిలీ కోర్టు దంపతుల పిటిషన్‌ను చెల్లుబాటు కానిదిగా తోసిపుచ్చిందని హైకోర్టు వివరించింది. వధువు మేజర్ అయ్యాక పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేయాలని అభ్యర్థించింది కాబట్టి ఆమె పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు అంగీకరించి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది.

First published:

Tags: Haryana, Highcourt, Punjab