Child beggar scores 63 percent in Class X: మొన్నటివరకు వీధుల్లో అడుక్కొనే ఓ యువకుడు ఇప్పుడు రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు. చదువే మన దరిద్రాన్ని పారద్రోలుతుందని నమ్మి అతడు సాధించిన విజయం తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. అతడే ఉత్తరప్రదేశ్(UttarPradesh) కు చెందిన షేర్ అలీ(Sher Ali). ఆగ్రాలోని సదర్ సబ్-డివిజన్‌లోని సెకండరీ స్కూల్ డివిజన్ కార్యాలయానికి దగ్గరగా ఉన్న మురికివాడలో నివసించే షేర్ అలీ..కుటుంబపరిస్థితుల కారణంగా గతంలో వీధుల్లో అడుక్కునేవాడు. అయితే అదే సమయంలో చదువుని కూడా నిర్లక్ష్యం చేయలేదు. శనివారం విడుదలైన యూపీ 10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాల్లో..అలీ 63శాతం మార్కులు సాధించాడు. ఇంగ్లీషులో అత్యధికంగా 80 మార్కులు సాధించిన అలీ...8X8 అడుగుల గుడిసెలో తన తండ్రి,తల్లి మరియు ఎనిమిది మంది తోబుట్టువులతో కలిసి నివసిస్తున్నారు. అలీ నివసించే గుడిసెకు కరెంట్ సప్లై కూడా లేదు.
నరేష్ పరాస్ అనే బాలల హక్కుల కార్యకర్త తనను భిక్షాటన నుండి తప్పించి ఉన్నత పాఠశాలలో చేర్పించినందువల్లే ఇదంతా సాధ్యమైందని అలీ చెప్పాడు. ఈ ఫలితాలు తనకు ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే విశ్వాసాన్ని ఇచ్చాయని..తాను ఇప్పుడు అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరి భారతదేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని చెప్పాడు.
Kailash Vijayvargiya : బీజేపీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్లకే ప్రాధాన్యం..బీజేపీ కీలక నేత వ్యాఖ్యలపై విపక్షాలు పైర్
షేర్ అలీ తండ్రి రంగి అలీ మాట్లాడుతూ..."నా బిడ్డ హైస్కూల్ పరీక్షలకు అర్హత సాధించడానికి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాడు. మా పొరుగున ఉన్న పిల్లలందరూ ఇప్పుడు అతని వైపు చూస్తున్నారు"అని తెలిపాడు. తన బిడ్డ చాలాసార్లు పస్తులున్నాడని,కానీ ఏనాడు చదువుకోవడం ఆపలేదని అలీ తల్లి తెలిపింది. రాత్రి నిశ్శబ్దంలో గంటల తరబడి చదువుకోవడానికి అతనికి ఒక జగ్ నీరు మరియు కొవ్వొత్తి వెలుగు మాత్రమే అవసరమైందని తెలిపింది.
బాలల హక్కుల కార్యకర్త నరేష్ పరాస్ మాట్లాడుతూ..."అలీకి చాలా సామర్థ్యం ఉంది. అతను తన చదువులో బాగా రాణించడమే కాకుండా, అథ్లెటిక్స్ మరియు వెయిట్ లిఫ్టింగ్‌తో సహా రాష్ట్ర మరియు జిల్లా స్థాయి క్రీడా ఈవెంట్‌లలో అనేక పతకాలు సాధించాడు. అతని ఆత్మవిశ్వాసం పెంచడానికి, నేను అతనిని థియేటర్ మరియు డ్యాన్స్‌కు పరిచయం చేసాను. తాజ్ మహోత్సవ్ వంటి ఆగ్రాలోని ప్రధాన కార్యక్రమాలలో అలీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. అతను ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్‌గా చేరడానికి తీవ్రంగా శిక్షణ పొందుతున్నాడు" అని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.