హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Viral Video: యూకేజీ పిల్లోడి దెబ్బకి ఫ్యూజుల్ ఔట్.. కిడ్నాపర్‌కే చుక్కలు చూపించిన చిచ్చర పిడుగు

Viral Video: యూకేజీ పిల్లోడి దెబ్బకి ఫ్యూజుల్ ఔట్.. కిడ్నాపర్‌కే చుక్కలు చూపించిన చిచ్చర పిడుగు

కిడ్నాప్‌ ప్రయత్నం దృశ్యాలు

కిడ్నాప్‌ ప్రయత్నం దృశ్యాలు

యూకేజీ పిల్లోడే కదా.. ఏం కాదులే అన్నట్లు ఫుట్‌పై అందరు చూస్తుండగానే కిడ్నాప్‌కు యత్నంచాడు.. కానీ పిల్లోడి తెలివితేటలకు బకరా అయ్యాడు.. వెంటనే అక్కడ నుంచి జారుకున్నాడు..

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్య కాలంలో కిడ్నాప్‌లు పెరిగిపోతున్నాయి.. డబ్బులు కోసమో.. లేకపోతే పగలు, ప్రతీకారాలు అంటూ చిన్నారును కిడ్నాప్‌ చేసి చిత్రహింసలు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.. అయితే కిడ్నాప్ చేసేవాళ్లు చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారు. కిడ్నపర్లకు బ్రెయిన్‌ ఎక్కువ.. ఎంతో ప్లాన్‌ వేసి.. స్కెచ్‌ గీసి కిడ్నాప్‌ చేస్తూంటారు.. ఇక కార్లలో వచ్చి పిల్లలను కిడ్నాప్‌ చేసిన ఘటనలు చాలానే చూశాం.. అయితే ఓ కిడ్నపర్‌ మాత్రం అందరి ముందే కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు.. యూకేజీ పిల్లోడే కదా.. ఏం కాదులే అన్నట్లు ఫుట్‌పై అందరు చూస్తుండగానే కిడ్నాప్‌కు యత్నంచాడు.. కానీ పిల్లోడి తెలివితేటలకు బకరా అయ్యాడు.. వెంటనే అక్కడ నుంచి జారుకున్నాడు..ఇంతకీ బాలుడు ఏం చేశాడు..? ఎక్కడ జరిగిందీ ఘటన..?

తప్పించుకున్న బాలుడు.. కంగుతిన్న కిడ్నాపర్:

అది కర్ణాటకలోని చిక్కమగళూరు.. ఆదివారం సాయంత్రం 6గంటల 38నిమిషాలు.. ఫుట్‌పాత్‌పై ఓ బాలుడు ఆడుకుంటున్నాడు.. అందరూ అటు ఇటు నడుస్తూ వెళ్తున్నారు.. ఆ పిల్లోడు మాత్రం తన ఆట తాను ఆడుకుంటున్నాడు.. ఇంతలోనే ఎక్కడ నుంచి వచ్చాడో.. ఎప్పటినుంచి అబ్జెర్వ్‌ చేస్తున్నాడో తెలియదు కానీ.. ఆ పిల్లోడి వైపు నడుచుకుంటూ దూసుకొచ్చాడు.. ఫుట్ పాత్‌పై ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అతడిని అపహరించి భుజాలపై ఎత్తుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో బాలుడు మేల్కొని కిడ్నాపర్ భుజం నుంచి సినిమాటిక్ పద్ధతిలో తప్పించుకున్నాడు.

https://fb.watch/jx05wy4BWb/

బాలుడు తప్పించుకోగానే కిడ్నాపర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకుని యూకేజీ కుర్రాడు చూపిన ధైర్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. కిడ్నాపర్‌ బారి నుంచి పిల్లోడు భలే తప్పించుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కిడ్నాపర్‌కు తిక్క కుదిరందంటున్నారు.. ఇక మరి కొంతమంది మాత్రం కిడ్నాపర్‌ అలా ఎలా కిడ్నాప్‌ చేయడానికి వచ్చాడో అర్థం కాలేదంటున్నారు.. ఒక వేళ పిల్లోడు తప్పించుకోకున్నా అక్కడున్న వాళ్లు ఇదంతా చూస్తున్నారని.. అతడు దొరికిపోయేవాడను కామెంట్ పెడుతున్నారు.. ఏదీ ఏమైనా నిండా ఆరేళ్లు కూడా లేని చిన్నోడు.. కిడ్నాప్‌ ఐనట్లు తెలుసుకోగానే అతడి నుంచి స్పాట్‌లోనే తప్పించుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది..

First published:

Tags: Karnataka, Kidnap

ఉత్తమ కథలు