ఎలాంటి దాడి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధం...ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

బిపిన్ రావత్ (ఫైల్ చిత్రం)

మన సైన్యం ముందుస్తుగా సరిహద్దు రేఖ వెంబడి మోహరించామని తెలిపింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

  • Share this:
    పాక్ తరపు నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మోహరింపుపై ఆయన స్పందించారు. మన సైన్యం ముందుస్తుగా సరిహద్దు రేఖ వెంబడి మోహరించామని తెలిపింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 1970-80 ప్రాంతంలో కాశ్మీర్ లో ప్రజలు సైన్యంతో ఎంతో సఖ్యతతో ఉండేవారని, త్వరలోనే అలాంటి పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రజలతో కలిసి మెలిసి ఉండాలనేదే తమ అభిమతమని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ గత కొంతకాలంగా సరిహద్దు రేఖ వెంబడి బలగాలను మోహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
    Published by:Krishna Adithya
    First published: