హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మీడియాలో వస్తున్న ఆ వార్తలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక ప్రకటన

మీడియాలో వస్తున్న ఆ వార్తలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక ప్రకటన

జస్టిస్ ఎన్ వీ రమణ (image credit - twitter - ANI)

జస్టిస్ ఎన్ వీ రమణ (image credit - twitter - ANI)

Breaking News: ప్రతి అంశంపైనా వేగంగా స్పందిస్తున్న సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ... తాజాగా మీడియాలో వస్తున్న ఓ రకం వార్తలపై ఘాటుగా స్పందించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఇండియాలో మీడియాకి చాలా స్వేచ్ఛ ఉంది. చాలా మీడియా సంస్థలు ఉన్నాయి. రోజూ కొన్ని వేల వార్తలు ఆ సంస్థల నుంచి వస్తున్నాయి. మరి వాటిలో నిజానిజాలేంటన్నది తేల్చడం అంత తేలిక కాదు. ఇదే విధంగా... సుప్రీంకోర్టు కొలీజియంకి సంబంధించి తాజాగా మీడియాలో వస్తున్న వార్తలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (CJI) ఎన్ వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో జడ్జిల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఆ వార్తలకు మీడియాదే బాధ్యత అని ఆయన అన్నారు.

ఇంతకీ మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళను నియమించేందుకు మంగళవారం సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది పేర్లను కేంద్రానికి సిఫారసు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ తొమ్మిది మందిలో... కర్ణాటక హైకోర్టు నుంచి జస్టిస్ బీవీ నాగరత్న పేరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లే జరిగితే... 2027లో ఆమె భారతదేశ సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారని ప్రచారం జరుగుతోంది. మిగతా 8 మందిలో... ఇద్దరు మహిళా న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు బార్... డైరెక్టుగా నియమించాలనుకుంటున్న మరొకరి పేరు కూడా ప్రధానంగా పరిశీలనలో ఉంది అన్నది మీడియా వార్తల సారాసం. ఐదుగురు సభ్యుల కొలీజియం ఎంపిక చేసిన పేర్లలో జస్టిస్ నాగరత్నతోపాటూ... తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ, గుజరాత్ హైకోర్టులో జడ్జిగా వ్యవహరిస్తున్న జస్టిస్ బెలా త్రివేది పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

కొలీజియం ఫైనలైజ్ చేసిన వారిలో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, కేరళ హైకోర్టు జడ్జి సీటీ రవికుమార్, కేరళ హైకోర్టు జడ్జి ఎంఎం సుందరేష్ ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ 9 మంది జడ్జిల్లో... ముగ్గురు... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అవుతారనీ.. వీరిలో జస్టిస్ నాగరత్న... 2027లో నెలకు పైగా సమయంలో.... సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (CJI) ఎన్వీ రమణ, జస్టిసెస్ ఉదయ్ యు లలిత్, ఏఎం ఖన్విల్కర్, ధనంజయ వై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావు ఉన్నారని మీడియా చెబుతోంది.

ఇది కూడా చదవండి: Video: షాకింగ్ సూపర్ వైరల్ మొసలి వీడియో. చూస్తే రెప్ప వాల్చలేరు!

ఇలా మీడియాలో వస్తున్న వార్తలపై జస్టిస్ ఎన్ వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మీడియానే బాధ్యత వహించాలని అన్నారు.

First published:

Tags: NV Ramana, Supreme Court

ఉత్తమ కథలు