GST Rate Structure: జీఎస్టీ రేట్లపై శుభవార్త చెప్పిన సీఈఏ సుబ్రమణియన్‌.. కేంద్రం మనసులో అదే ఉందన్న సీఈఏ

కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్

జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించాలని చాలా రోజులుగా ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్న విషయం తెలిసిందే. వ్యాపారవర్గాలు కూడా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూనే ఉన్నాయి. అలాంటివారందరికీ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ శుభవార్త చెప్పారు.

  • Share this:
జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరించాలని చాలా రోజులుగా ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్న విషయం తెలిసిందే. వ్యాపారవర్గాలు కూడా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూనే ఉన్నాయి. అలాంటివారందరికీ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ అజెండాలో జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ అంశం ఉందని, కచ్చితంగా జీఎస్టీ రేట్లను హేతుబద్దీకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐదు శ్లాబ్స్‌లో ఉన్న జీఎస్టీ రేట్లను మూడు స్లాబ్స్‌కు తీసుకురావాలనేదే ప్రభుత్వం అజెండా అని ఆయన పేర్కొన్నారు.

జీఎస్టీలో మూడు రేట్ల వ్యవస్థ చాలా ముఖ్యం. ప్రస్తుతం జీఎస్టీలో 0.25 శాతం, ఐదు శాతం, 12శాతం, 1 శాతం, 28 శాతం స్లాబ్స్‌ ఉన్న విషయం తెలిసిందే. వీటిని మూడు స్లాబ్స్‌కు తీసుకొచ్చే ప్రతిపాదన ఉందని సుబ్రమణియన్‌ చెప్పారు. ఎక్సైజ్‌ పన్ను, సేవా పన్ను, వ్యాట్‌ లాంటి పదికిపైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ట్యాక్స్‌లను కలిపి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)గా 2017 జులైలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం విదితమే. అయితే అప్పటి నుంచే స్లాబ్స్‌ మార్పు గురించి చర్చ, విజ్ఞప్తులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సుబ్రమణియన్‌ మాటతో దీనిపై కేంద్రం ఆలోచన చేస్తోందనే విషయం బయటికొచ్చింది. ‘‘జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు అనుకున్నది మూడు స్లాబ్‌లే. అయితే వివిధ కారణాల వల్ల స్లాబ్‌ల సంఖ్య ఐదుకు చేరింది. కానీ రేట్ల హేతుబద్దీకరణ ఉంటుంద’’ని సుబ్రమణియన్‌ చెప్పారు.

దీంతోపాటు ఇన్వర్టెడ్‌ సుంకాల విధానమూ అంతే ముఖ్యం అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నామని సుబ్రమణియన్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు ద్రవ్యోల్బణం గురించి కూడా సుబ్రమణియన్‌ మాట్లాడారు. టోకు ద్రవ్యోల్బణం జులై నాటికి ఆరు శాతం దిగువకు వెళ్తుందని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలంపాటు ఐదు శాతం పైన ఉంటుందని ఆయన అంచనా వేశారు. మరోవైపు గత మూడు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ నిర్దేశించిన మ్యాగ్జిమమ్‌ టార్గెట్‌ కంటే రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదవుతున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ వసూళ్ల గురించి ఆయన మాట్లాడుతూ... జూన్‌ నెలలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దిగువకు వచ్చాయని... లక్ష కోట్ల దిగువకు చేరడం గత ఎనిమిది నెలల కాలంలో ఇదే తొలిసారని చెప్పారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగానే ఇలా జరిగిందని సుబ్రమణియన్‌ చెప్పారు.

ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో మన దేశంలో ఐదో స్థానంలో ఉందని తెలిపారు. అయితే మన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇంకా మెరుగవ్వాల్సి ఉందని తెలిపారు. గ్లోబల్‌ టాప్‌ బ్యాంక్స్‌ జాబితా గురించి చెబుతూ... స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 55వ స్థానంలో ఉందని తెలిపారు. అదే తొలి 50లో చైనా నుంచి 18 బ్యాంకులు ఉన్నాయని, యూఎస్‌ నుంచి 12 బ్యాంకులు ఉన్నాయని తెలిపారు.
Published by:Sambasiva Reddy
First published: