అప్పుడు సీబీఐతో ప్రశంసలు... ఇప్పుడు అదే సీబీఐతో అరెస్టు... చిదంబరం పరిస్థితి ఇది...

Chidambaram : కాలం కలిసిరాకపోతే అరటి పండు తిన్నా పళ్లు రాలిపోతాయన్నట్లు తయారైంది చిదంబరం పరిస్థితి. రాజకీయ నేతల విషయంలో చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 22, 2019, 10:34 AM IST
అప్పుడు సీబీఐతో ప్రశంసలు... ఇప్పుడు అదే సీబీఐతో అరెస్టు... చిదంబరం పరిస్థితి ఇది...
చిదంబరాన్ని (మధ్యలో) అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
  • Share this:
బుధవారం రాత్రి ఇంటి గోడలు దూకి మరీ వెళ్లి... కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆయన ఇంట్లోనే అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. ఈ పరిస్థితి తర్వాత... ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే... ఓ ఫ్లాష్ బ్యాక్ చిదంబరానికి చెంపపెట్టులా కనిపిస్తుంది. ఇప్పుడు అరెస్టు చేసిన సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ఒకప్పుడు ప్రారంభించింది చిదంబరమే కావడం శోచనీయం. యూపీఏ పాలనలో 2008 నవంబరు 29 నుంచీ 2012 జులై 31 వరకు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు చిదంబరం. అప్పట్లో ఆయన హోదా, పనితీరుపై పెద్ద ఎత్తున చర్చ జరిగేది. ఆ సమయంలో... 2011 జూన్ 30న ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయ భవనాన్ని చిదంబరమే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు అదే సీబీఐ కార్యాలయానికి అరెస్టై వెళ్లారు చిదంబరం.


చిదంబరం తప్పు చేసి అరెస్టయ్యారా లేక... కేంద్రంలో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కావడంతో సీన్ రివర్స్ అయి అరెస్టయ్యారా అన్నది కోర్టు తేల్చే అంశం.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్టు చేసినా... ఈ కేసులో తాను, తన కొడుకు కార్తీ చిదంబరం నిర్దోషులమని చిదంబరం చెప్పుకుంటున్నారు కాబట్టి... కేసు దర్యాప్తు పూర్తైన తర్వాతే... వాస్తవం ఏంటన్నది తెలుస్తుంది. అప్పటివరకూ ఆయన నిందితుడే అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు