ప్రణబ్‌కు చిదంబరం ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?

ఆర్ఎస్ఎస్ సభకు హాజరై ఆ సంస్థ సిద్ధాంతాల్లోని తప్పుల గురించి చెప్పాలని ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరం సలహా ఇచ్చారు.

Janardhan V | news18
Updated: June 1, 2018, 5:02 AM IST
ప్రణబ్‌కు చిదంబరం ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
File Photos of Chidambaram and Pranab Mukherjee
  • News18
  • Last Updated: June 1, 2018, 5:02 AM IST
  • Share this:
Chidambaram advises to Pranab Mukherjee
File Photos of Chidambaram and Pranab Mukherjee


ఆర్ఎస్ఎస్ నాగ్‌పూర్‌లో జూన్‌ 7న నిర్వహించే సభకు హాజరయ్యేందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంగీకరించడంపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ప్రణబ్ ముఖర్జీ నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్ఠానం మౌనంవహిస్తుండగా ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు ప్రణబ్ నిర్ణయం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. మతతత్వ సంస్థ అయిన ఆరెస్సెస్‌ సభకు ప్రణబ్‌ వెళ్లడం సరికాదంటూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రణబ్ నాగ్‌పూర్ వెళ్లాలన్న తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వీరి అభిప్రాయాలకు భిన్నంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ సభకు ప్రణబ్ వెళ్లాలంటూనే...ఈ సందర్భంగా ప్రణబ్‌కు ఓ సలహా ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ సభకు హాజరై...ఆ సంస్థ సిద్ధాంతాల్లోని తప్పల గురించి మాట్లాడాలని సూచించారు. తమ సభకు హాజరుకావాలన్న ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించారని, ఇక దీనిపై చర్చ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే! సార్...మీరు ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించారు. సభకు వెళ్లి వారి సిద్ధాంతాల్లోని తప్పుల గురించి మాట్లాడండి’ అని చిదంబరం కోరారు.

ఆర్ఎస్ఎస్ సభకు హాజరుకావాలన్న ప్రణబ్ నిర్ణయంపై రాజకీయ రగడ కొనసాగుతున్న తరుణంలో చిదంబరం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మౌనంవహిస్తుండగా...ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రణబ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. లౌకికవాదానికి కట్టుబడి తన నిర్ణయంపై ప్రణబ్ పునరాలోచన చేయాలని కోరారు.

దేశ లౌకిక వాద ప్రయోజనాల దృష్ట్యా నాగ్‌పూర్‌ వెళ్లవద్దని ప్రణబ్‌ను కోరుతూ కేరళా అసెంబ్లీలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. మీ నిర్ణయం లౌకికవాద భావజాలమున్న వారిని షాక్‌కు గురిచేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ మతతత్వ సంస్థగా ఆరోపించారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చే సిద్ధాంతంతో సంఘ్ పనిచేస్తోందని...ఇది కాంగ్రెస్ లౌకిక, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. పార్టీ దిగ్గజ నేతల్లో ఒకరైన ప్రణబ్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ శ్రేణులను విస్తుపోయేలా చేస్తున్నట్లు చెప్పారు.

అటు ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాన్ని తప్పుబడుతూ కేంద్ర మాజీ మంత్రి జాఫర్‌ షరీఫ్‌ ప్రణబ్‌కు లేఖరాశారు. ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం లౌకికవాదులను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతితో సహా పలు అత్యున్నత పదవుల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ...లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లడం సరికాదన్నారు.

ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ కూడా ప్రణబ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. గతంలో ఆర్ఎస్ఎస్‌ దేశ విద్రోహ సంస్థ, మతతత్వ సంస్థ, ఆర్ఎస్ఎస్‌కు సిద్ధాంతలు లేవని, అవినీతిమయమైనదని, అబద్ధాలను ప్రచారం చేస్తుందంటూ ప్రణబ్ ముఖర్జీ గతంలో తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని ఆహ్వానించడం ద్వారా తమపై చేసిన ఆరోపణలను ఆర్ఎస్ఎస్ అంగీకరించేలా ఉందన్నారు.మరోవైపు తమ కార్యక్రమానికి హాజరుకావాలన్న ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఆర్ఎస్ఎస్ తిప్పికొట్టింది. గతంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో మహాత్మాగాంధీ, జయ్ ప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారని, అలాగే 1963నాటి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ఆహ్వానించారని గుర్తుచేశారు.

ఇదిలా ఉండగా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సమర్థించారు. ప్రజాస్వామ్యంలో అస్పృశ్యతకు చోటు ఉండకూడదన్నారు. అయినా ఆరెస్సెస్‌ ఒక భారతీయ సంస్థే గానీ పాకిస్థాన్‌ చెందిన ఐఎస్‌ఐ కాదని ఆయన పేర్కొన్నారు.
Published by: Janardhan V
First published: June 1, 2018, 5:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading