• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CHHATTISGARH TEACHER SUSPENDED AFTER BEING FOUND DRUNK IN CLASSROOM BS

క్లాస్‌కు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్.. పాఠం చెప్పాలని అడిగితే..

క్లాస్‌కు ఫుల్లుగా తాగొచ్చిన టీచర్.. పాఠం చెప్పాలని అడిగితే..

తాగొచ్చి క్లాస్‌లో నిద్రపోయిన టీచర్

రోజూ ఇలాగే పాఠశాలకు తాగొచ్చి క్లాస్‌రూంలో కునుకు తీసేవాడు.. ఒక రోజు కాకపోయినా, మరో రోజు పాఠం చెబుతాడులే అనుకున్న విద్యార్థులు వేచి చూసి విసిగిపోయారు.

  • Share this:
    అతడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. విద్యార్థులు తప్పుదారిలో వెళ్తే సన్మార్గంలో నడిపించాల్సిన వృత్తిలో ఉన్నాడు.. కానీ, తానే తప్పు దారి పట్టాడు.. తన వృత్తిని గౌరవించకుండా తప్ప తాగి పాఠశాలకు వచ్చాడు.. ఒక్క రోజు, రెండు రోజులు కాదు.. రోజూ ఇలాగే పాఠశాలకు తాగొచ్చి క్లాస్‌రూంలో కునుకు తీసేవాడు.. ఒక రోజు కాకపోయినా, మరో రోజు పాఠం చెబుతాడులే అనుకున్న విద్యార్థులు వేచి చూసి విసిగిపోయారు. ఇక లాభం లేదనుకొని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ ఊరివాళ్లంతా కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అతడ్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని తురంగ్‌ఖర్ ప్రైమరీ పాఠశాలలో చోటు చేసుకుంది. అజయ్‌దన్ మింజ్ అనే స్కూల్ టీచర్ రోజూ పాఠశాలకు తాగొచ్చి క్లాస్ రూంలో నిద్రపోయేవాడు.

    దీంతో విద్యార్థుల ఫిర్యాదుతో తల్లిదండ్రులంతా కలిసి పాఠశాలకు వచ్చి హెడ్ మాస్టర్‌ను నిలదీశారు. దీంతో ఆయన పైఅధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఆ జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    అగ్ర కథనాలు