నిత్యం ఉరుకుల పరుగులు జీవితంలో ఉంటూ, రాజకీయనేతల నుంచి ఒత్తిళ్లు, పనులతో ఊపిరి సలపనంత బిజీబిజీగా గడిపే జిల్లా కలెక్టర్లు కూడా బాడీ మీద ఇంత శ్రద్ధ తీసుకుంటారా?
సహజంగా సిక్స్ ప్యాక్ అంటే సినిమా హీరోలే. వాళ్లు ఇచ్చిన స్ఫూర్తితోనే సాధారణ జనం కూడా సిక్స్ ప్యాక్ అంటూ జిమ్‌ల బాట పట్టారు. సినిమా వాళ్లు ఫిజిక్కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. కానీ, నిత్యం ఉరుకుల పరుగులు జీవితంలో ఉంటూ, ప్రజా జీవనంలో ఉంటూ, రాజకీయనేతల నుంచి ఒత్తిళ్లు, పనులతో ఊపిరి సలపనంత బిజీబిజీగా గడిపే జిల్లా కలెక్టర్లు కూడా బాడీ మీద ఇంత శ్రద్ధ తీసుకుంటారా? అంటే మనం నమ్మలేం. కానీ, ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తన కండలు తిరిగిన దేహంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ ఆ కలెక్టర్ పేరువినిత్ నందన్వార్. ఛత్తీస్ గఢ్లోని సుక్మా జిల్లా కలెక్టర్. ఆయన కొంతకాలం క్రితం కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పుడు కోలుకున్నారు. కరోనా వైరస్ బారిన పడి మనిషి కొంత డీలా పడి ఉంటారనుకుంటే.. అందరికీ తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించి ఆయన ఆశ్చర్యపరిచారు.