హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇంటికే మద్యం.. ఆ క్యూలైన్లు చూశాక ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయం

ఇంటికే మద్యం.. ఆ క్యూలైన్లు చూశాక ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయం

అయితే, కోర్టు తీర్పు రాకముందే అక్కడ 29,000 లీటర్ల మద్యం మిస్ అయినట్టు ఆజ్ తక్ రిపోర్టు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)

అయితే, కోర్టు తీర్పు రాకముందే అక్కడ 29,000 లీటర్ల మద్యం మిస్ అయినట్టు ఆజ్ తక్ రిపోర్టు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వం నిర్ణయంపై విపక్ష బీజేపీ మండిపడుతోంది. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా ఇంటికి మద్యం సరఫరా చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.

  లాక్‌డౌన్ 3లో మద్యం విక్రయాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో చాలా రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలు ఓపెన్ కావడంతో మందుబాబులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సోమవారం చాలా చోట్ల కిలోమీటర్ల క్యూలైన్లు కనిపించాయి. మద్యం ప్రియులు గుంపులు గుంపులుగా చేరి సామాజిక దూరం పాటించలేదు. ఏపీ, ఢిల్లీ, కర్నాటకతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ క్రమంలో ఛత్తీస్‌ఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైన్ షాప్‌ల వద్ద భారీ క్యూలైన్లు ఉంటే కరోనా విజృంభించే ప్రమాదముందని భావించి.. రాష్ట్రంలో లిక్కర్ హోమ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది.

  ఛత్తస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో లిక్కర్ అమ్మకాలను చేపట్టింది ఎక్సైజ్ శాఖ. CSMCL వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మద్యాన్ని కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. సదరు వెబ్‌సైట్లో మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్క వ్యక్తి ఒకసారి గరిష్ఠంగా 5 లీటర్ల వరకు లిక్కర్ కొనుక్కోవచ్చని చెప్పారు. లిక్కర్ డోర్ డెలివరీ చేసినందుకు రూ.120 డెలివరీ చార్జీలు వసూలు చేస్తారు. ఐతే గ్రీన్ జోన్లలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఐతే ప్రభుత్వం నిర్ణయంపై విపక్ష బీజేపీ మండిపడుతోంది. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా ఇంటికి మద్యం సరఫరా చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది సిగ్గు చేటని విరుచుకుపడ్డారు. లిక్కర్ డోర్ డెలివరీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Chhattisgarh, Liquor sales, Liquor shops, Wine shops

  ఉత్తమ కథలు