CHHATTISGARH ENCOUNTER OVER 25 30 NAXALS KILLLED IN BIJAPUR ENCOUNTER SAYS CRPF DG KULDIEP SINGH SK
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు హతం.. సీఆర్పీఎఫ్ డీజీ ప్రకటన
సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ (Image:ANI)
ఎన్కౌంటర్లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 30 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
శనివారం ఛత్తీస్గఢ్ అడవుల్లో రక్తపుటేరులు పారిన విషయం తెలిసిందే. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఐతే ఎన్కౌంటర్లో భద్రతా దళాలతో పాటు మావోయిస్టుల వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగిందని CRPF డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు. దాదాపు 30 మంది వరకు మరణించిన ఉంటారని.. ఐతే ఖచ్చితంగా ఎంత మంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఉన్న ఆయన బీజాపూర్లో పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కుల్దీప్ సింగ్ ఎన్కౌంటర్కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
''ఇందులో నిఘా వర్గాల వైఫల్యం ఉందనడానికి ఎలాంటి ఆస్కారం లేదు. నిఘా వైఫల్యం ఉంటే భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టే వారే కాదు. భద్రతా దళాల ఆపరేషన్లోనూ వైఫల్యం లేదు. ఎందుకంటే ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు కూడా చాలా మంది చనిపోయారు. మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు మావోయిస్టులు మూడు ట్రాక్టర్లను ఉపయోగించారు. ఐతే ఖచ్చితంగా ఎంత మంచి చనిపోయారో ఇప్పుడే చెప్పలేం. 25 నుంచి 30 మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారు.'' అని డీజీ కుల్దీప్ సింగ్ వెల్లడించారు.
No operational, intel failure, over 25-30 Naxals killed in Bijapur encounter: DG CRPF Kuldiep Singh
మరోవైపు ఎన్కౌంటర్లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 30 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు గాలిస్తున్నారు. మావోయిస్టుల కోసం కూడా కూంబింగ్ కొనసాగుతోంది.
కాగా, ఏప్రిల్ 2న బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో కూడిన 2వేల మంది జవాన్లు అడవులను గాలించారు. ఈ క్రమంలో శనివారం తారెమ్ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్ మడ్వి హిడ్మా నేతృత్వంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.