• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CHHATTISGARH ENCOUNTER GUN FIGHT BETWEEN POLICE AND MAOISTS IN DANTEWADA DISTRICT SU

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత.. పోలీసులు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత.. పోలీసులు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు..

ప్రతీకాత్మక చిత్రం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత చోటుచేసుకుంది. దంతెవాడ జిల్లాలో పోలీసులు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

  • Share this:
    ఛత్తీస్‌గడ్‌లో మరోమారు మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇటీవల బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటన మరవకముందే.. తాజాగా ఆదివారం దంతెవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్..అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా.. ఒక మావోయిస్టు మృతిచెందారు. మృతుడిని మావోయిస్టు మిలీషియా కమాండర్‌ వెట్టి హుంగాగా గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపారు. మరికొందరు మావోయిస్టులు కూడా ఈ ఎదురుకాల్పుల్లో మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో 9 ఎంఎం పిస్టల్స్, 2 కిలోల ఐఈడీని, పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, వెట్టి హుంగాపై లక్ష రూపాయల రివార్డు ఉంది.

    వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు..
    మరోవైపు చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరోమారు మావోయిస్టులు రెచ్చిపోయారు. నెమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మింగాచెల్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ఫిల్టర్ వద్ద 5 వాహనాలను మావోయిస్టులు తగలపెట్టారు. మావోయిస్టులు ధ్వంసం చేసిన వాటిలో నిర్మాణ పనులను వినియోగిస్తున్న వాహనాలు కూడా ఉన్నాయి.



    ఇటీవల ఛత్తీస్‌గడ్‌‌లో నక్సల్స్‌-జవాన్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు మృతి చెందగా 31 మందికి గాయాలపాలయ్యారు. మావోయిస్టులు పక్కా ప్లాన్‌తోనే భద్రతా సిబ్బందిని ట్రాప్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. మావోయిస్ట్ అగ్రనేత, మోస్ట్ వాటెండ్ మడ్వి హిడ్మా.. తారెమ్ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు ఓ పుకారు సృష్టించారు మావోయిస్టులు. అది నిజమని నమ్మి అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. అప్పటికే మాటువేసి ఉన్న మావోయిస్టులు భధ్రతా సిబ్బందిపై మెరుపు దాడి చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు