వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏకంగా సీఎం తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

భూపేష్ బాగల్

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. బ్రాహ్మణుల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా అరెస్టు చేశారు. 

 • Share this:
  ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) ముఖ్యమంత్రి భూపేష్ బాగల్ (Chhattisgarh CM Bhupesh Baghel) తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. బ్రాహ్మణుల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా అరెస్టు చేశారు. భూపేష్ బాగల్ తండ్రి నందకుమార్‌ను (Nand Kumar Baghel arrest) అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను రాయపూర్‌లోని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రాయ్‌పూర్‌లో (Raipur) కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం భూపేష్ బాగల్ తండ్రి నంద్ కుమార్ బాగల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బ్రాహ్మణుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులను గ్రామాల్లోకి రానివ్వవద్దని పిలుపునిచ్చారు. ‘భారత్‌లోని గ్రామీణ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒక్కటే. బ్రాహ్మణులను మీ ఊళ్లలోకి రానీయవద్దు.’ అని నంద్ కుమార్ బాగల్ వ్యాఖ్యానించారు. ఇతర సామాజిక వర్గాల ప్రజలందరితో తాను మాట్లాడతానని.. అందరం కలిసి బ్రాహ్మణులను బహిష్కరిద్దామని సీఎం తండ్రి పిలుపునిచ్చారు.

  వోల్గా నదీ తీరాలకు వాళ్లను తిరిగి పంపాల్సిన అవసరం ఉందని నంద్ కుమార్చే చేసినవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బ్రాహ్మణ సామాజిక వర్గం భగ్గుమంది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి తండ్రి అయి ఉండి.. ఒక సామాజిక వర్గాన్ని బహిష్కరించాలంటూ.. ఇలా బాధ్యత లేకుండా.. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏంటని బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘాలు, రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ‘సర్వ్ బ్రాహ్మిణ్ సమాజ్’ సభ్యులు ఫిర్యాదు చేశారు.

  కూలుతున్న స్మారకస్థూపాలు.. చత్తీస్‌ఘడ్‌ పోలీసుల వ్యూహం.. ఉద్యమరూపం తీసుకున్న వైనం..  బ్రాహ్మణుల ఫిర్యాదు మీద డీడీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి యోగితా కపర్దే స్పందించారు. ‘నందకుమార్ బాగల్ చేసిన వ్యాఖ్యల మీద బ్రాహ్మణ సామాజిక వర్గం అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని అభ్యంతరం తెలిపింది.’ అని యోగితా కపర్దే అన్నారు. ఇక సీఎం కూడా తాను తన తండ్రిని ఓ కొడుకులా గౌరవిస్తానని చెప్పారు. అయితే, సీఎంగా ఆయన తప్పులను మాత్రం ఒప్పుకోబోనన్నారు.


  ఓ సీఎం తండ్రి మీద కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం భూపేష్ బాగల్ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. 86 సంవత్సరాల వయసున్న తన తండ్రి అయినా కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే కుదరదని కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: