Home /News /national /

CHHATTISGARH CM BHUPESH BAGHEL ANNOUNCES ACTION PLAN TO BUY COW URINE FROM FARMERS SK

Cow Urine: రైతులకు శుభవార్త.. పేడతో పాటు గోమూత్రాన్ని కూడా ప్రభుత్వమే కొంటుంది

gold chain

gold chain

Cow Urine: గోమూత్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి.. దానితో సేంద్రీయ పురుగుమందులు తయారు చేసి రైతులకు అందజేయాలని యోచిస్తోంది. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, విషపూరిత పురుగుమందుల వాడకం వల్ల భూసారం తగ్గిపోతుందని.. సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని సీఎం భూపేష్ బఘేల్ అన్నారు.

ఇంకా చదవండి ...
    భారత సంస్కృతి, సంప్రదాయాల్లో గోమూత్రానికి ప్రత్యేక స్థానముంది. హిందువులు ఆవును గోమాతగా పూజిస్తారు. ఆవు మూత్రాన్ని  (Cow Urine) కూడా అంతే పవిత్రంగా భావిస్తారు. పూజలు, యజ్ఞాల్లో ఆవు మూత్రాన్ని వినియోగిస్తారు. అనేక ఆయుర్వేద మందుల్లోనూ ఉపయోగిస్తారు. పొలానికి సత్తువ ఇచ్చి.. పంట దిగుబడి పెరిగేందుకు.. ఎరువుగా కూడా వాడుతారు. అందుకే ఆవు మూత్రానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పట్టణాల్లో ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. అందువల్ల బాటిళ్లలో విక్రయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఎరువుల కోసం వాడుతారు. ఎన్నో ప్రత్యేకతలున్న గోమూత్రాన్ని ఇంకా చాలా పల్లెల్లో సరిగ్గా వినియోగించుకోవడం లేదు. ఈ క్రమంలోనే వారిని ప్రోత్సహించేలా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం (Chhattisgarh) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆవు పేడను కొంటున్న ప్రభుత్వం.. ఇక నుంచి ఆవు మూత్రాన్ని కూడా కొనేందుకు ముందుకొచ్చింది.

    కరోనాతో ఎక్కువగా చనిపోయింది భారతీయులే..WHO తాజా రిపోర్ట్ లో సంచలన విషయాలు!

    రైతుల నుంచి గోమూత్రం కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Chhattisgarh CM Bhupesh Baghel) పేర్కొన్నారు. ఇటీవల బలరాంపూర్ జిల్లా రాజ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని పశువుల యజమానుల నుంచి గోమూత్రాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని అన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పశువుల రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులకు బదులు గోమూత్రం వాడుతున్న రైతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు సంప్రదించి.. అనంతరం నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శిని సీఎం భూపేష్ బఘేల్ ఆదేశించారు. వ్యవసాయ రంగంలో గోమూత్రాన్ని శాస్త్రీయంగా, క్రమబద్ధంగా వినియోగించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

    Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి..అక్కడే అధికంగా స్థానాలు పెంపు!

    గోమూత్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి.. దానితో సేంద్రీయ పురుగుమందులు తయారు చేసి రైతులకు అందజేయాలని యోచిస్తోంది. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, విషపూరిత పురుగుమందుల వాడకం వల్ల భూసారం తగ్గిపోతుందని.. సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని సీఎం భూపేష్ బఘేల్ అన్నారు. మితిమీరిన రసాయనాల వినియోగం ప్రజల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. గోమూత్రం వల్ల రైతులకు ఆదాయం పెరగడంతో పాటు సేంద్రీయ వ్యవసాయం వల్ల మంచి లాభాలు కలుగుతాయని అన్నారు.

    Electricity Subsidy: అదంతా మన ఇష్టం,మనం చూజ్ చేసుకోవచ్చు..విద్యుత్‌ రాయితీ పథకంపై కేజ్రీవాల్ వెనకడుగు!

    అంతేకాదు ఆవు మూత్రంలో మందులుకు కూడా తయారు చేయనున్నారు. గోమూత్రాన్ని శుద్ధి చేసిన తర్వాతే మందులు తయారు చేయాలన్నది ప్రభుత్వ యోచన. ఐతే ప్రభుత్వం ఎన్ని లీటర్ల గోమూత్రాన్ని కొనుగోలు చేస్తుంది? ఎంత రేటు ఇస్తుంది? ఔషధాల తయారీ, విక్రయం వరకు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక ఏమిటన్న వివరాలను మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. కాగా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల నుంచి పేడ సేకరిస్తోంది. గోధన్ న్యాయ యోజన కింద కిలోకు రూ.2 చెల్లించి పేడను కొనుగోలు చేస్తోంది. ఆ పేడతో పిడకలు, దీపాలు, ఎరువులు, ఇతర ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తోంది. పేడ ఉత్పత్తులతో గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chhattisgarh, Cow Urine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు