కరోనా లాక్డౌన్తో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పదో తరగతి సహా అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో జులైలో పరీక్షలు నిర్వహించేందుకు పలు ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. ఐతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిపోయిన 10, 12 తరగతి పేపర్లకు పరీక్షలు నిర్వహించకూడదని ఛత్తీస్గఢ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు నిర్ణయించింది. ఆయా పేపర్లకు ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా మార్కులను కేటాయిస్తామని CGBSE సెక్రటరీ ప్రొ. వీకే గోయల్ తెలిపారు. కాగా, లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికే 1 నుంచి 9 తరగతులు, 11వ తరగతి విద్యార్థులను పాస్ చేశారు. పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారు.
Chhattisgarh Board of Secondary Education has decided to not conduct examination of the remaining papers for classes 10 & 12. The marks for these papers will be given on the basis of internal assessment: Prof VK Goyal, Secretary, Chhattisgarh Board of Secondary Education #COVID19
మార్చి చివరి వారంలో లాక్డౌన్ ప్రకటించడంతో 10, 12వ తరగతి పరీక్షలు నిలిచిపోయాయి. అప్పటికే కొన్ని పరీక్షలను నిర్వహించారు. కానీ మిగిలిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. లాక్డౌన్ ముగిశాక పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ.. ఆ తర్వాత లాక్డౌన్ 2, లాక్డౌన్ 3 కూడా అమల్లోకి వచ్చాయి. మే 17 తర్వాత కూడా లాక్డౌన్ 4పై ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఇప్పట్లో వదిలే అవకాశం లేదని.. మరోవైపు వచ్చే విద్యాసంవత్సరానికి సమయం దగ్గరపడుతోందని.. ఈ క్రమంలోనే మిగిలిఉన్న 10, 12 తరగతుల పరీక్షలను రద్దు చేసినట్లు CGBSE వెల్లడించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.