ఈవీఎంలలో నేతల భవితవ్యం..ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన పోలింగ్

నవంబరు 12న తొలిదశలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 76.28 శాతం పోలింగ్ నమోదయింది. డిసెంబరు 11న ఎన్నికల ఫలితాల వెల్లడవుతాయి

news18-telugu
Updated: November 20, 2018, 9:42 PM IST
ఈవీఎంలలో నేతల భవితవ్యం..ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన పోలింగ్
కవర్దాలో ఓటు వేసిన సీఎం రమణ్ సింగ్
  • Share this:
ఛత్తీస్‌గఢ్‌లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 71.93 శాతం ఓటింగ్ నమోదయింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో భారీ ఓటర్లు ఉండడంతో..వారిని పోలింగ్‌కు అనుమతించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉందని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు.

రెండో దశ ఎన్నికల్లో మొత్తం 72 నియోజకర్గాల్లో మొత్తం 1079 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 119 మంది మహిళా అభ్యర్థులున్నారు. మొత్తం 1,53,85,000 పైగా ఓటర్లున్నారు. 19,296 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ చేపట్టారు. కవర్దా నియోజకవర్గంలో సీఎం రమణ్‌సింగ్ ఓటు హక్కు వినియోగించకున్నారు. ఐతే ఆయన పోలీచేసిన రాజ్‌నందన్‌గావ్ నియోజకవర్గానికి తొలి విడతలో పోలింగ్ జరిగింది.

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్), ప్రతిపక్ష నేత టీఎస్ సింగ్ డియో (కాంగ్రెస్) సహా పలువురు కీలక నేతలు రెండో దశ ఎన్నికలలో అదృష్టం పరీక్షించుకున్నారు. వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. కాగా, నవంబరు 12న తొలిదశలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 76.28 శాతం పోలింగ్ నమోదయింది. డిసెంబరు 11న ఎన్నికల ఫలితాల వెల్లడవుతాయి



.
Published by: Shiva Kumar Addula
First published: November 20, 2018, 8:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading