స్కూల్‌కు వెళ్తున్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె...ఎందుకో తెలుసా?

దీపికా పదుకొణె

ఇటీవల బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన దీపికా... కొన్నిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంది. పెద్దగా సెట్స్‌పై ఎక్కడా కనిపించలేదు.

 • Share this:
  బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొణె స్టైలే వేరు. రోటిన్‌కు భిన్నంగా ఆమె వెరైటీ కథల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీపికా నటించిన బాజీరావు మస్తానీ, పద్మావత్, కాక్ టైల్ సినిమాల్లో బాలీవుడ్ బాక్సఫీస్‌ను బద్దలుకొట్టాయి. ఇటీవల బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన దీపికా... కొన్నిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంది. పెద్దగా సెట్స్‌పై ఎక్కడా కనిపించలేదు. పెళ్లి తర్వాత ఆమె తొలిసారిగా వాస్తవ కథనాల ఆధారంగా తెరకెక్కుతున్న చప్పక్ మూవీలో నటిస్తోంది దీపికా. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. చప్పక్ మూవీకి సంబంధించిన అనేక స్టిల్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది దీపికా.

  deepika padukone
  యాసిడ్ బాధితురాలిగా దీపికా పదుకొనే


  తాజాగా దీపికా స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో స్కూల్ డ్రెస్సులో ఉన్న దీపికా స్కూల్ బ్యాగ్ తగిలించుకొని ఉంది. అచ్చం స్కూలుకు వెళ్లే అమ్మాయిలాగానే మనకు కనిపిస్తుంది. ఈవీడియో చూసిన నెటిజన్లంతా దీపికాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఇట్టే దీపికా ఒదిగిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన పద్మావత్ తర్వాత దీపికా ఏ సినిమాలోనే నటించలేదు. పెళ్లి తర్వాత ఏం సినిమా చేయాలి? ఎలాంటి సినిమాల్లో నటించాలి అన్న దానిపై ఆలోచనలు చేసింది దీపికా. దీంతో ఆమె ఇప్పుడు చప్పక్ సినమాతో మరోసారి కెమెరా ముందుకొస్తోంది. చప్పక్ చిత్రానికి మేఘన్‌ గుల్జర్‌ దర్శకురాలు.

  పెళ్లి తర్వాత దీపిక.. చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమాలో దీపికా జోడిగా విక్ర‌మ్ మాసే న‌టించ‌నున్నారు. 2005లో యాసిడ్ దాడి కార‌ణంగా బాధింప‌బ‌డి, యాసిడ్ ఎటాక్స్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తూ ప‌లు అవార్డులు అందుకున్నారు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ . ఇప్పుడు ఆమె పాత్ర‌లో దీపిక న‌టించ‌నుండ‌టం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.


  First published: