ఛపాక్ మూవీ ఎఫెక్ట్.. యాసిడ్ బాధితులకు పించన్ పథకం

యాసిడ్‌ దాడి బాధితులు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రతి ఏడాది రూ.5000-రూ.6000 నగదును ఫించన్‌గా అందించే విధంగా కొత్త పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు.

news18-telugu
Updated: January 12, 2020, 10:58 PM IST
ఛపాక్ మూవీ ఎఫెక్ట్.. యాసిడ్ బాధితులకు పించన్ పథకం
యాసిడ్ బాధితురాలిగా దీపికా పదుకొనే
  • Share this:
బాలీవుడ్‌లో 'ఛపాక్' మూవీ దుమ్మురేపుతోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న విడుదలై మంచి విజయం సాధించింది. కమర్షియల్‌గా హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఛపాక్ మూవీ తెరకెక్కింది. ఐతే ఛపాక్ ప్రభావంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. యాసిడ్‌ బాధితులకు త్వరలోనే ఫించన్‌ను అందించాలనుకుంటున్నామని ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి రేఖా ఆర్యా తెలిపారు. యాసిడ్‌ దాడి బాధితులు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రతి ఏడాది రూ.5000-రూ.6000 నగదును ఫించన్‌గా అందించే విధంగా కొత్త పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. కేబినెట్‌లో ఈ పథకం ఆమోదం పొందిన వెంటనే దీనిని అమలులోకి తెస్తామని తెలిపారు. యాసిడ్ దాడికి గురైన మహిళలు.. తమ కలలను సాకారం చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు రేఖా ఆర్యా.

First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు