కరోనాను గెలిచి చనిపోయిన పది రూపాయల డాక్టర్...

కేవలం రూ.10 ఫీజుతో ఎందరో పేదలకు వైద్య సేవలు అందించిన డాక్టర్ మోహన్ రెడ్డి కన్నుమూశారు.

news18-telugu
Updated: July 26, 2020, 6:41 PM IST
కరోనాను గెలిచి చనిపోయిన పది రూపాయల డాక్టర్...
డాక్టర్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
డాక్టర్ సి.మోహన్ రెడ్డి.. చెన్నైలో పది రూపాయల డాక్టర్‌గా పేరుగాంచిన వైద్యుడు చనిపోయారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. డాక్టర్ రెడ్డి దాతృత్వంలో ఎంతో పేరు ఉంది. వయసు సహకరించకపోయినా, కరోనా వైరస్ సమయంలో కూడా అనారోగ్యంతో తన ఆస్పత్రికి వచ్చిన వారికి చికిత్స అందించారు. డాక్టర్ మోహన్ రెడ్డికి జూన్ 25న కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనకు ఆ తర్వాత కోవిడ్ 19 నెగిటివ్ వచ్చింది. సడన్‌గా కుప్పకూలి ఆయన చనిపోయినట్టు కుటుంబసభ్యులు చెప్పారు. డాక్టర్ మోహన్ రెడ్డి బ్రహ్మచారి. ఎప్పుడూ ఆస్పత్రిలోనే ఉండేవారు. అర్ధరాత్రి పూట చికిత్స కోసం ఎవరైనా రోగులు వచ్చినా అందుబాటులో ఉండడం కోసం ఆయన అక్కడే ఉండేవారు. రూ.10 డాక్టర్ గా పేరుగాంచిన ఆయన దగ్గర వైద్యం చేయించుకోవడానికి పేదలు క్యూ కట్టేవారు. ముఖ్యంగా మురికివాడల నుంచి పెద్ద ఎత్తున ఆయన ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకునేవారు. డాక్టర్ మోహన్ రెడ్డి స్వస్థలం నెల్లూరు. 1936లో జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసం గూడూరులో చేశారు. కిల్పాక్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. ఎన్నో సంస్థలకు ఆయన దానాలు చేశారు. తన వద్దకు వచ్చి సాయం అడిగిన వారు ఎవరికి కాదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవారని ఆయన సోదరుడు డాక్టర్ సీఎంకే రెడ్డి తెలిపారు.

డాక్టర్ మోహన్ రెడ్డి మృతిపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన డాక్టర్ మోహన్ రెడ్డి సోదరుడు డాక్టర్ సీఎంకే రెడ్డికి సంతాప సందేశాన్ని పంపారు. సామాజికవేత్తగా, వైద్యుడిగా,మానవతావాదిగా, తెలుగుభాషాభిమానిగా వారు చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. చివరి క్షణం వరకు రూ.10 కన్సల్టేషన్ రుసుముతోనే చికిత్స అందించి సమాజం పట్ల తన ఉదారత చాటుకున్నారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 26, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading